ఈ మద్య ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ కోసం వచ్చే వారి జివితాలతో ఆడుకుంటున్నారని ఆ మద్య నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లు కావాలని ఇండస్ట్రీకి వస్తే వారి మాన ప్రాణాలతో ఆడుకునే వారు ఎంతో మంది ఉన్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ యువతి తాను హీరోయిన్ ఛాన్స్ కోసం వస్తే..కొన్ని బాత్ రూమ్ సీన్లు డెమో అని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే..ఉపేంద్ర కుమార్ ఓ వెబ్‌సిరీస్ ప్లానింగ్ నిమిత్తం ఓ షార్ట్‌ఫిల్మ్ చేశాడు. అది కూడా సెల్‌ఫోన్‌తో. ముంబైలోని వెస్ట్ అంబేరీలో ఉన్న రామ్‌గోపాల్ వర్మ ఈ వీడియో తీశారు. డెమో కోసం ప్లాన్ చేసిన ఆ వీడియోలో ఓ సన్నివేశంలో హీరోయిన్ టవల్‌తో కనిపించాలి. సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం తిరుగుతున్న ఓ అమ్మాయి సరే అని ఒప్పుకుని షూట్లో పాల్గొంది. అయితే, ఊహించని విధంగా హీరోయిన్ ఒంటిపై ఉన్న టవల్ జారిపోవడం, ఆ సీన్లన్నీ వీడియోలో రికార్డయ్యాయి. ఆ సీన్లు తీసేస్తామని చెప్పినా..తీయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షాకైన సదరు హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హీరోయిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, వర్మ ఆఫీసులో ఆ సంఘటన జరగడం, ఆ సన్నివేశం షూటింగ్ కూడా వర్మ ఆఫీసులోని బాత్రూమ్లో చోటు చేసుకోవడం.. వీడియో లీకేజ్ వెనకాల వర్మ ప్రమేయం ఉందంటూ మీడియాలో వార్తలు రావడం మొదలెట్టాయి. మొత్తానికి ఉపేంద్ర కుమార్ ఉన్న అడ్రస్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదవ జోన్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమ్‌జిత్ సింగ్ ఉపేంద్ర కుమార్ అరెస్టును ఖరారు చేశారు. మొత్తానికి రామ్‌గోపాల్ వర్మ ఊపిరి పీల్చుకున్నారు.