‘మీటూ’పై రకూల్ సంచలన వ్యాఖ్యలు!

Edari Rama Krishna
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ‘మీటూ’ఉద్యమం భారీ ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం పై బాలీవుడ్ హీరోయిన్లు తనుశ్రీదత్తా, కంగనా రౌనత్ ఇతర నటీమణులు చేస్తున్న ఆరోపణలతో ప్రకంపణలు పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే మీటూ ఉద్యమం పేరుతో కొంత మది అనవసరంగా సెలబ్రెటీల పేర్లు రచ్చకీడుస్తున్నారు.   గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ‘మీటూ’ ఉద్యమానికి సంబంధించిన వార్తలే కనపడుతున్నాయి.

గతంలో వివిధ సందర్భాలలో తాము ఎదుర్కున్న వేధింపులను పలువురు వెల్లడిస్తున్నారు.  తాజాగా ‘మీటూ’ ఉద్యమంపై బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   లైంగిక పరమైన వేధింపులు.. మహిళలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి సరికాదని అభిప్రాయపడింది.  సంఘంలో మహిళలు ప్రతి రంగాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని..అలాంటి వారు తాము అనుభవించిన నరకం గురించి చెప్పడం తప్పుకాదని..కానీ ఇదే అదునుగా భావించి తమ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే..మీటూ ఉద్యమానికి అర్థం లేకుండా పోతుందని అన్నారు.

ఈ ఉద్యమం భారత్‌లో రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రకుల్.. లైంగిక వేధింపుల విషయంలో తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు.  కాకపోతే ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవాలు తనకు ఇప్పటి వరకు ఎదురు కాలేదని ఆమె వెల్లడించారు. బాధితులంతా బయటకు రావడం పట్ల రకుల్ ఆనందం వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: