విజయ్ దేవరకొండ బంగారు బాటకు చిరంజీవి సలహా !

Seetha Sailaja
‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తో క్రేజీ హీరోగా మారిపోయి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ తనకు మెగా స్టార్ చిరంజీవి ఇచ్చిన సలహాను బయటపెట్టాడు. ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఈఆసక్తికర విషయాలను షేర్ చేసాడు.

‘గీత గోవిందం’ సక్సస్ మీట్ కు చిరంజీవిని ముఖ్యఅతిధిగా ఆహ్వానించడానికి తాను చిరంజీవి ఇంటికి అరవింద్ తో కలిసి వెళ్ళినప్పుడు తనకు మెగా స్టార్ ఇచ్చిన గౌరవాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు ఒకతండ్రిలా ఎన్నో సలహాలను ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టాడు విజయ్. ఒక స్టార్ కొడుకు అయి ఉండి ఇండస్ట్రీలో రాణించడం పెద్దకష్టం కాదని అప్పటికే స్థిరపడ్డ ఆ స్టార్ హీరో అభిమానులు అతడి కొడుకు అభిమానులుగా మారిపోతారని అయితే స్వయం కృషితో ఎదగడం ఎంతకష్టమో తనకు తెలుసు అంటూ చిరంజీవి తనకు చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు ఈక్రేజీ హీరో.

ఇదేసందర్భంలో చిరంజీవి తనకు ఒకసలహా ఇస్తూ ప్రేక్షకుల నుండి విపరీతమైన క్రేజ్ రావడం ఎంతకష్టమో ఆక్రేజ్ ను నిలబెట్టుకోవడం మరింత కష్టమని చెపుతూ తనకు అసలైన పరీక్ష ఇప్పటి నుంచే మొదలైంది అంటూ కెరియర్ లో ఏచిన్న తప్పు చేసినా దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి అంటూ చిరంజీవి ఒక మెగా స్టార్ లా కాకుండా ఒక తండ్రిలా తనకు ఇచ్చిన సలహాలను గుర్తుకు చేసుకున్నాడు విజయ్. ఇది ఇలా ఉండగా ఈవారం విడుదలైన చిన్న సినిమాలు నాలుగులో ‘అంతకు మించి’ ఆటగాళ్ళు’ నీవెవరో’ ‘లక్ష్మి’ మూవీలలో ఏఒక్క సినిమాకు కనీసపు హిట్ టాక్ కూడా రాకపోవడంతో ‘గీత గోవిందం’ హవా ఎటువంటి అడ్డు లేకుండా కొనసాగబోతోంది.

ఇప్పటికే ఈమూవీ 50 కోట్ల నెట్ కలక్షన్స్ ను దాటిన నేపధ్యంలో ఈవీకెండ్ పూర్తి అయ్యే సరికి 60కోట్ల నెట్ కలక్షన్స్ ఫిగర్స్ ను అందుకున్నా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీకి వస్తున్న లాభాలను చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ మీడియా కూడ ఆశ్చర్య పోతోంది అంటే ‘గీత గోవిందం’ మ్యానియా ఏస్థాయిలో షేక్ చేస్తోందో అర్ధం అవుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: