స్టార్ సింగర్ ఇంట్లో చోరీ..!

Edari Rama Krishna
ముంబైలోని అంధేరి వెస్ట్ ఓషివారా ప్రాంతంలో బాలీవుడ్ స్టార్ సింగ‌ర్ మికా సింగ్ నివసించే ఫ్లాట్ లో భారీ చోరీ జరిగింది.  . సుమారు రూ.4 లక్షల విలువైన నగదు, ఆభరణాలు దొంగిలించబడినాయి. తన ఇంట్లో జరిగిన దొంగతనంపై మిఖాసింగ్ తరుఫున అతడి మేనేజర్ ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే అక్కడున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు.. అయితే అందులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడం గమనించారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓషివారా పోలీస్ స్టేషన్ హెడ్ పాసల్వార్ చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

అయితే అక్కడున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. మికా సింగ్ దగ్గరే పనిచేసే ఓ ఉద్యోగి బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి అతడే అనుమానితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓషివారా పోలీస్ స్టేషన్ హెడ్ పాసల్వార్ చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: