పవన్ రాజకీయ వ్యూహంతో బన్నీ మూవీ !

Seetha Sailaja
సినిమాలకు దూరమై రాజకీయాలలోకి ప్రవేసించిన పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ సిద్ధాంతాలను ఆశయాలను వివరించే ఒక సినిమా చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం పవన్ అభిమానులలో ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి పరిస్థుతులలో ఊహించని విధంగా పవన్ రాజకీయ ఉద్దేశ్యాలకు పరోక్షంగా మద్దతు పలుకుతూ అల్లు అర్జున్ ఒక పొలిటికల్ మూవీలో నటించబోయే అవకశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

‘నాపేరు సూర్య’ పరాజయం తరువాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎన్నో కథలు విన్నాడు. దర్శకులు విక్రమ్ కుమార్ హరీష్ శంకర్ లు చెప్పిన కథలు మొదట్లో నచ్చినా ‘నాపేరు సూర్య’ ఫలితం వచ్చిన తరువాత ఆకథలను తిరస్కరించాడు బన్నీ. ఈమధ్యలో యంగ్ డైరెక్టర్ విఐ ఆనంద్ చెప్పిన కథ బన్నీకి నచ్చినా అతడు నిర్ణయం చెప్పడంతో ఆలస్యం చేస్తూ ఉండటంతో విసుకు చెందిన ఈ యాంగ్ డైరెక్టర్ రవితేజ కాంపౌండ్ లోకి వెళ్ళిపోయాడు. 

ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ ను క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈమధ్య కలిసి ఒక పవర్ ఫుల్ పొలిటికల్ స్టోరీని చెప్పినట్లు సమాచారం. ఈకథ బన్నీకి బాగా నచ్చినా అలాంటి పవర్ ఫుల్ పొలిటికల్ పాత్రలో తాను నటిస్తే జనం చూస్తారా అని అనుమాన పడుతున్నట్లు టాక్. దీనికితోడు శేఖర్ కమ్ముల సినిమాలలో మాస్ ను ఆకర్షించే మసాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తనకు ఈకథ ఎంత వరకు సరిపోతుంది అన్న అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే శేఖర్ కమ్ముల గత ఏడాది తీసిన ‘ఫిదా’ సూపర్ సక్సస్ అయిన నేపధ్యంలో ధైర్యం చేసి ఈ రాజకీయ సినిమా ప్రయోగానికి ఒప్పుకోమని బన్నీ పై అతడి సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పవన్ నటించలేకపోయిన పొలిటికల్ మూవీని బన్నీ నటించి పరోక్షంగా పవన్ కు సహాయం చేస్తున్నాడనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: