విమర్శించిన విమర్శలను అనుసరిస్తున్న పవన్ !

Seetha Sailaja
ఈరోజు పవన్ కళ్యాణ్ తన రాజకీయ విశ్వరూపం చూపెట్టబోతున్నాడా అన్న ఆసక్తి పెరిగిపోతోంది. ఉద్ధానం కిడ్నీ వ్యాది గ్రస్తుల సమస్యల పై పవన్ నిన్న సాయంత్రం నుండి నిరాహారదీక్ష ప్రారంభించిన నేపధ్యంలో ఆ నిరాహార దీక్షకు అనుమతులు లభించని నేపధ్యంలో ఈరోజు తన హీరోయిజమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చూపెట్టడానికి ఒక ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి పవన్ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ముగిసి పోవడంతో పవన్ బస చేస్తున్న ఎస్ ఎస్ ఆర్ పురంలో మునిసిపల్ గ్రౌండ్స్ లో గానీ ఎన్టీఆర్ స్టేడియంలో గానీ నిరాహార దీక్ష చేయడానికి పవన్ దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో పవన్ తాను బస చేసిన విచ్చెర్ల నియోజిక వర్గ పరిధిలోని ఎస్ ఎస్ ఆర్ పురంలో రిసార్ట్స్ లోనే ఆహారం మానేసి నిరాహార దీక్షకు దిగినట్లుగా మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

ఈ విషయాన్ని కూడ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు పవన్ తన రిసార్ట్ నుండి బయటకు వచ్చి జనం మధ్య నిరాహార దీక్ష కొనసాగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు పవన్ చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ అభిమానులను ఈరోజు దీక్షలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అటువంటి సంఘటన జరిగితే స్వతహాగా ఆవేశంతో ఉండే పవన్ అభిమానులను నియంత్రించడం కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో కొందరు పవన్ ను టార్గెట్ చేస్తూ పవన్ గతంలో చెప్పిన ఉపన్యాసలలోని విషయాలను పవన్ కు గుర్తు చేస్తున్నారు. గతంలో పవన్ ప్రత్యేక హోదా విషయమై జరుగుతున్న ఉద్యమం పై స్పందిస్తూ నిరాహారదీక్షలు చేసి జనం రోడ్డుమీదకు వచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు అని కామెంట్ చేసాడు. మరి పవన్ తాను చెప్పిన మాటలనే మర్చిపోయి నిరాహార దీక్షలు చేయడం తన అభిమానులను మండుటెండలలో రోడ్డు పైకి రమ్మని సంకేతాలు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ పవన్ తన అభిప్రాయాలను మార్చుకున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: