ఆ సినిమాలో మా అబ్బాయిని నేనే వొద్దన్నా : రవితేజ

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో బెంగాల్ టైగర్ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘రాజా ద్రి గ్రేట్’ చిత్రంతో దుమ్మురేపాడు మాస్ మహరాజ రవితేజ. రెండు సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం కూడా ఓ ప్రయోగాత్మక పాత్రతో (అంధుడిగా) నటించి మెప్పించాడు.  ఈ చిత్రంలో రవితేజ చిన్ననాటి పాత్రలో ఆయన తనయుడు మహధన్ అద్భుతంగా నటించి మెప్పించాడు.  రవితేజ ఒక వైపున ఈ నెల 25వ తేదీన 'నేల టిక్కెట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే, మరో వైపున శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. 

ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహధన్ ఓ కీలక పాత్రలో నటింపజేయాలని శ్రీను వైట్ల భావించారట..అందుకు రవితేజను సంప్రదించగా ఓకే చెప్పాడట. కానీ ఈ సినిమాలో మహాధన్ చేయడం లేదని అంటున్నారు. తాజాగా ఈ విషయాన్ని గురించి రవితేజ స్పందించాడు.  'రాజా ది గ్రేట్' లో మా అబ్బాయి మహాధన్ చాలా బాగా చేశాడు.  వాడికి ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి.

అందుకు తండ్రిగా నేను ఎంతో గర్వపడ్డాను..ఇక  'అమర్ అక్బర్ ఆంటోని' నటింపజేయాలని భావించినా..షెడ్యూల్స్ లో జరిగిన మార్పు కారణంగా, స్కూల్స్ ఓపెన్ చేసిన తరువాత వాడు షూటింగులో పాల్గొనవలసి ఉంటుంది. స్కూల్ మాన్పించి యాక్టింగ్ చేయించడం నాకు ఇష్టం లేదు .. అందుకే ఈ సినిమా చేయవద్దులే అని నేనే అన్నాను" అంటూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు.     


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: