మంచు ప్యామిలి హీరోయిన్‌కు కష్టాలు
మంచు ప్యామిలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది విలక్షణ నటుడు డాక్టర్ మోహన్‌బాబు. మోహన్‌బాబు అంటే గుర్తుకు వచ్చేది మంచు లక్ష్మీనే. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మీ లేటుగా వచ్చినా, మనోజ్,విష్ణుల కంటే ఎక్కువుగానే క్రేజ్‌ను సంపాదించుకుంది. అందుకే మంచు లక్ష్మీ పేరు అంతగా పాపులర్ అయింది. తెలుగులో సొంతగా తీసిన మూవీలన్ని బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిర్మాతగా మంచు లక్ష్మీ మంచి పేరును సంపాదించుకోలేక పోయింది. కాని యాక్టర్‌గా అందరి అభిమానాన్ని చూరగొంది. అయితే మంచు లక్ష్మీ దగ్గరకు వచ్చే పాత్రలన్ని ఆమెకు నచ్చితేనే చేస్తుంది. డబ్బుకోసమే, హీరోయిన్గా ఎదగాలనే ఆతృతతోనే నటించదంట.
దీంతో మంచు లక్ష్మీకు పాత్ర ఇవ్వాలంటే ఏ ప్రొడ్యూజర్ అయినా, డైరెక్టర్ అయినా కొద్దిగా భయపడాతాడు, మరికొద్దిగా ఆలోచిస్తాడు. ఇటువంటి ధోరణితో మంచు లక్ష్మీకు హీరోయిన్ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకోవాలని ప్రయత్నిస్తున్న లక్ష్మీకు ఆ కోరిక తీరడంలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద లక్ష్మీకు ఉన్న కోరికలను దాదాపుగా విరమించుకుంటుందని టాలీవుడ్ టాక్. అందుకే బుల్లితెరపై ఎక్కువుగా దృష్టి పెడుతూ, రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో మణిరత్నం కడలి మూవీలో నటించిన మంచు లక్ష్మీకు నిరాశే ఎదురయ్యింది.