ఆ విషయంలో నన్ను చెప్పుతో కొట్టండి!

Edari Rama Krishna
నిన్న మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై న్యాయ పోరాటం కోసం నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం అందరికీ తెలిసిందే.  కొన్ని రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్ పై వివిధ ఛానల్స్ లో ఇంటర్వ్యూలతో ఊదరగొట్టిన శ్రీరెడ్డి కి అనూహ్యంగా మహిళా సంఘాల మద్దతు లభించింది.  ఇదే సమయంలో కొంత మంది జూనియర్ ఆర్టిస్టుల సపోర్ట్ కూడా రావడంతో శ్రీరెడ్డి ఉద్యమం పుంజుకుందని అందరూ భావించారు.  ఇంతలోనే శ్రీరెడ్డి జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాన్..ఆయన తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కథ మొత్తం రివర్స్ అయ్యింది.

శ్రీరెడ్డిపై ఒక్కసారే విమర్శలు రావడం మొదలయ్యాయి..మద్దతు ఇచ్చిన వారు పక్కకు తొలిగారు. ఇక పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు అంతే లేకుండా పోయింది. వెంటనే పవన్ కళ్యాన్ తల్లిగారికి క్షమాపణలు కోరారు శ్రీరెడ్డి..అయినా కూడా వివాదం రోజు రోజుకీ శృతి మించి పోతూనే ఉంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తల్లిపై వాడిన అసభ్య పదజాలంపై శ్రీరెడ్డి కొద్ది సేపటి క్రితం స్పందించింది. పవన్ తల్లికి క్షమాపణ చెప్పింది. మీ చెప్పుతో కొట్టండి అంటూ ట్వీట్ చేసింది.

‘‘పవన్ కల్యాణ్ అమ్మగారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగ నమస్కారాలు. నన్ను క్షమించండి అమ్మ, మీ చెప్పుతో కొట్టండి. కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే కానీ అర్థం కాలేదమ్మా ఈ ఒంటరి ఆడపిల్ల బాధ. మీ ఫోటో చూసి పది లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ’’ అంటూ ట్వీట్ చేసింది. 

మరో ట్విట్ లో ‘‘ఫ్యాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ప్రజల సమస్యల కోసం పోరాడుతూ.. నలుగురికి మార్గదర్శకం అవ్వాలి అంతేకానీ సహనం లేకుండా కార్‌లు పగలగొట్టడం కాదు. ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు’’ అని తెలిపింది. 

కాస్టింగ్ కౌచ్ పై మెగా ఫ్యామిలీ గతంలో స్పందించి ఉంటే ఎంతో హుందాగా ఉండేదని..తనకు ఈ కష్టాలు వచ్చేవే కాదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాదు  రామ్ చరణ్, అల్లు అర్జున్‌కి తాను వీరాభిమానినని తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: