ఆ దర్శకుడితో నాకు ఎఫైర్ లేదు : రాశీఖన్నా

siri Madhukar
రాశీఖన్నా అందం, అభినయంతో ఆకట్టుకొంటున్నది. తెలుగు చక్కగా మాట్లాడే అందాల భామ పాటలు కూడా పాడుతున్నది.  ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత  ఈ అమ్మడు వరుస విజయాలు అందుకుంటూ వస్తుంది. ఈ మద్య రిలీజ్ అయిన తొలిప్రేమ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అంతే కాదు ఈ సినిమాలో రాశీఖన్నా చాలా అందంగా ఆకర్షనీయంగా కనిపించిందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ మద్య పుట్టిన రోజు చేసుకున్న రాశీఖన్నా తనపై వస్తున్న రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చింది. 

ఇండస్ట్రీలో ఇప్పుడే తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని..ఇంతలోనే తనపై రూమర్లు పుట్టుకు రావడం ఎంతో బాధ అనిపిస్తుందని వాపోయింది.  ఇక తనకి హిట్ సినిమా ఇచ్చిన టాలీవుడ్‌లోని ఓ దర్శకుడితో ఏవేవో సంబంధాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆమె ఖండిస్తూ.. ఆ దర్శకుడు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని ఆ గాసిప్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన రాజా ది గ్రేట్ చిత్రంలో ఓ సాంగ్‌లో నటించింది.  దాంతో ఆ దర్శకుడికి..రాశీఖన్నా కు మద్య లవ్ స్టోరీ నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి.  దీనిపై స్పందించిన రాశీఖన్నా..సుప్రీమ్ చిత్రంతో మంచి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు. బెంగాల్ టైగర్ చిత్రంలో రవితేజగారితో నటించాను.

అప్పటి నుంచి రవితేజగారితో స్నేహంగా ఉంటాను. వారిద్దరి కోసమే రాజా ది గ్రేట్ చిత్రం సాంగ్‌లో కనిపించాను. అంతే తప్ప మా మధ్య ఎటువంటి ఎఫైర్స్ లేవు.  సాధారణంగా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు పుట్టుకు రావడం సహజమే..కానీ లేనిది ఉన్నట్టు..ఎలాపడితే అలా రాయవద్దు. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకునే జ్ఞానం ఉన్నప్పుడు తెలిసి కూడా ఎలా తప్పు చేస్తాను..’’ అంటూ రాశీఖన్నా ఈ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: