మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సంచల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మద్య ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మాద్యమాల ద్వారా సెలబ్రెటీలను టార్గెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' (జీఎస్టీ) ఎన్నో వివాదాలు మూటగట్టుకుంది.  ఆ మద్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటంతో సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో శనివారం నాడు సీసీఎస్ పోలీసుల విచారణకు వర్మ హాజరైన విషయం తెలిసిందే.

మహిళా సంఘం నేతలపై చేసిన అసభ్యకర కామెంట్స్ పై నిన్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, రాంగోపాల్ వర్మ ఉక్కిరిబిక్కిరయ్యారట. మొత్తానికి  దేవికి క్షమాపణ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే..హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత, మీడియాలో వస్తున్న వార్తలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు.   తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు.  సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు.  ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఓ ఆంగ్రపత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశాడు వర్మ. 
For all those false news circulating that I have denied making #GodSexTruth,its only a production and technical process that I was detailing ..How can I deny when I am credited in the film? https://t.co/eJrULnCBUJ

— Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: