అప్పుడు సింహంలా గర్జించిన పవన్ కి ఇప్పుడేమైంది : వర్మ

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ టాప్ హీరోగా వెలిగిపోతున్న సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సంసిద్దం అవుతున్న పవన్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  అంతే కాదు ప్రస్తుతం ఆయన సీనియర్ నేతలతో బేటీ అవుతూ..ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగిస్తున్నాడు.  ఇక టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా తన సినిమాల కన్నా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మాద్యమాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. 

ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పై స్పందిస్తూ..ఏ విషయాన్ని వదలడం లేదు. సెలబ్రెటీలు, పొలిటీషన్స్, క్రీడాకారులు ప్రతి ఒక్కరిపై తనదైన వివాదాస్పద కామెంట్స్ చేస్తూ హడావుడి చేస్తున్నారు.  తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్ నొవోటెల్‌లో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ కల్యాణ్ ఓ సింహంలా కనిపించారని, ఆయన మాటలు సింహ ఘర్జనను తలపించాయని.. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆయన చిరంజీవిలా మారిపోతున్నట్లున్నారని వర్మ చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు పవన్ కల్యాణ్ సింహంలా వున్నారని.. ప్రస్తుతం చిరంజీవిలా మారిపోతున్నారని వర్మ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గొప్ప ఆత్మస్థైర్యంతో అన్ని నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయాలని... లేకపోతే ఆయన సోదరుడు చిరంజీవి కన్నా పెద్ద తప్పు చేసినవాడవుతారని వర్మ వ్యాఖ్యానించాడు. సమకాలీన అంశా లపై స్పందించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సందేశంతో వార్తలో నిలిచాడు. గత రాత్రి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ని ఉద్దేశించి వ్యంగ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు. ఇక గతంలో కూడా పవన్‌ రాజకీయ విధానాలపై కూడా ఆర్జీవీ ఇలాగే సెటైర్లు పేల్చిన విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: