"హరిహర వీరమల్లు" టీజర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అనేక సార్లు ప్రారంభం అయ్యి ఆగిపోయి కొంత భాగం షూటింగ్ ను ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంది. ఇక మొదట ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలు అయింది. ఇక ఈ మూవీ షూటింగ్ అనుకున్న టైం కు కాకపోవడంతో ఈయన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దానితో రూల్స్ రంజాన్ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఇకపోతే ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 3.14 మిలియన్ వ్యూస్ , 259.2 కే లక్స్ లభించాయి.

ఇక ఈ సినిమా యొక్క టీజర్ కు మంచి వ్యూస్ లైక్స్ లభించినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ వ్యూస్ , లైక్స్ మాత్రం ఈ సినిమా టీజర్ కు దక్కలేదు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను బట్టి చూస్తే పేదవాళ్లను కొంత మంది ధనవంతులు దోచుకుంటూ ఉంటే ఆ ధనవంతులను దోచుకునే దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఇలా ధనవంతులను దోచుకునే బందిపోటు దొంగ పాత్రలో పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఏ ఎం రత్నం ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: