మీరిచ్చే డబ్బులుకు అంతా చూపించాలా అంటున్న హీరోయిన్..!

Prathap Kaluva

నయనతార ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అని  చెప్పవచ్చు. ఈ అమ్మడకు ఒక పక్క వయసు అయిపోతున్న తనకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. సీనియర్ స్టార్ హీరోస్ ఎగబడి మరీ తననే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ భామ పెడుతున్న షరతు లు చూసి నిర్మాతలు ఆశ్చర్య పోతున్నారు . అయితే కొంతమంది హీరోలతో నయనతార అప్పట్లో ప్రేమాయణం నడిచి అది కాస్త బెడిసి కొట్టి సైలెంట్ అయిపోయింది.


కానీ ఇప్పుడు తాజాగా మరో తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగివున్నట్టు టాక్. అయితే ప్రియుడు ఇప్పటికే నయనతారకు కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది. నువ్వు నటించే సినిమాల్లో హీరోలకు దగ్గరవ్వడం, ముద్దుల సీన్లు ఇలాంటివి చేయకూడదని షరతులు పెట్టాడట. దీంతో నయనతార కూడా తనను సంప్రదించే దర్శకులు, నిర్మాతలకు, ప్రస్తుతం షూటింగ్‌లో సినిమా దర్శకులకు కొన్నిషరతులు పెట్టేసిందట.  


హీరోలకు దగ్గరగా వెళ్ళే సీన్లు చేయను, ముద్దుల సీన్లు అసలు ఉండకూడదు.. కురచ దుస్తులు వేసుకోను. ఇలా ఒకటేమిటి.. ఎన్నో షరతులు పెట్టిందట. ఉన్నట్లుండి నయనతార ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని కొంతమంది దర్శకులు ఆమెనే అడిగారట. మీరిచ్చే రెమ్యునరేషన్‌కు ఇంత కష్టపడాలా అంటూ తిరిగి దర్శకులకే ప్రశ్నలు వేస్తోందట నయనతారు.


ఆ తర్వాత దర్శకులు విషయం తెలుసుకుంటే అసలు కథ తెలిసిందట. అందుకే దర్శకులు కూడా నయనతార షరతులకు ఒకే అంటున్నారట. ఇలా షరతులతో కూడిన సినిమాలు చేయడానికి అందరూ దర్శకులు ఒప్పుకోరు.. ఇక నయనతారకు సినిమా అవకాశాలు తగ్గిపోతాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి షరతు లు పెడితే ఆ అమ్మడు కేవలం సైడ్ క్యారెక్టర్స్ కే మాత్రమే పనికివస్తుందని కొందరు సెటైర్స్ వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: