పవన్ కళ్యాణ్ "చరిత్ర"

తెలుగువారి సినిమా అభిమానం అనంతం. దాన్ని సొమ్ము చేసుకోవటానికి కొందరు సినీ తారలు రాజకీయాల్లోకి దూసుకు రావటానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రముఖుడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే వార్త ఏమంటే "అజ్ఞాతవాసి" థియేటర్స్‌కి సంచలనంగా వచ్చిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు గుడ్-బై చెప్పే అవకాశాలున్నాయని అనేక సందర్భాల్లో ఆయన మాటలను బట్తి అనుకుంటున్నదే.


ఈ నూతన సంచలన సమాచారం ప్రకారం ఆయన 'అజ్ఞాతవాసి'‌ తో సినిమాను వదిలేసే ప్రసక్తి కనిపించటం లేదు. "చరిత్ర" వెనక్కి వెళ్ళే ఆలోచన వీలుంటే తిరగ రాసేందుకు ప్రయత్నిస్తూ మరో సినిమాతో ఆయన అభిమాన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనేది చిత్ర పురిలో నుండి వస్తున్న సమాచారం. ఇప్పుడిదే సినీ సర్కిల్‌ లో హాటెస్త్ టాపిక్. అంతేకాదు ఆయన తరువాత చిత్రానికి పవన్-ఫ్యాన్స్ రోమాంచితమయ్యే "టైటిల్‌" ను ప్రచారంలోకి తీసుకు రావటం తో "జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" అభిమానులు రెట్టించిన ఉత్సాహతో ఫుల్ జోష్‌ తో కుమ్మేస్తున్నారు. 


"నిశబ్దం వీడి ఆయుధం" అనే ఉప శీర్షిక (సబ్-టైటిల్) తో "చరిత్ర" అనే ప్రైం టైటిల్‌ తో పవన్ తరువాత చిత్రం ఉండ బోతుందని, "చరిత్ర" నామధేయతో పవన్ కళ్యాన్ ఉద్వేగంతో ఆవేశంతో పిడికిలి బిగించిన "పోస్టర్" ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం. "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" రాజకీయంగా తన "జనసేన" పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చి తదుపరి బలోపేతం చేసేందుకు అద్భుత ప్రణాళికతో ముందుకు వెళుతున్నారట. ఇటు  సినిమాలు అటు రాజకీయాలు "రెండు పడవల ప్రయాణం" అంత సురక్షితం కాదని నటన కు వీడ్కోలు చెప్తున్నట్టు గతంలో ప్రకటించినప్పటికీ, ముందుగా అంగీకరించిన  అయిన ప్రాజెక్ట్‌ లను పూర్తి చెసేందు పవన్ కళ్యణ్ రెడీ అయ్యారు.


అయితే "అజ్ఞాతవాసి" తరువాత మరో సినిమాకు అంగీకారం తెలిపినందున అదిపూర్తి చేసిన తరువాతే, తన "పొలిటికల్ షెడ్యూల్" సిద్ధమౌతుందని తాజాగా అందిన  సమాచారం. నిజానికి పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు నేసన్ 'వేదాళం' సినిమా రీమేక్‌ను తెరకెక్కించాలని అనుకున్నాడు. అంతేకాదు ఏ.ఎం. రత్నం నిర్మాతగా ఈ సినిమా పూజా కార్య క్రమాలు కూడా జరుపుకొంది. కానీ ఇప్పటి వరకు సినిమా మాత్రం సెట్స్ పైకి చేరలేదు. ఒకా నొక దశలో ఇక ఈ సినిమా ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆగిపోలేదట.

ఏ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఇటీవల చెప్పిన విషయాలను బట్టి, ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ సినిమాకు ముందుగా ఈ సినిమానే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా నిర్మాణం మొదలవ్వడంతో ఈ రీమేక్ ఆలస్యమైందని తెలు స్తోంది. అతడు డైరెక్ట్ చేసిన ఆక్సిజన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు ఎదురైన ప్రశ్నలకు జవాబుగా ఆయన పవన్ సినిమా విషయాల గురించి స్పష్టం చేశాడు.


దీనితో పాటు ఇటీవల జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుక లోనూ ఏ.ఎమ్. రత్నం అదే వేదిక మీద పవన్ కళ్యాన్ పక్కనే కూర్చొని ఉండటం వీరి కాంబో మూవీని పట్టాలెక్కించటంలో ఏలాంటి సంశయం లేదని తేలిపోయింది. ఇక మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందట. కాగా ఈమూవీలో పవన్ కళ్యాణ్ సరసన ఒక బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నట్టు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది.


మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావటానికి ముందు ఇంకెన్ని సినిమాలకు సైన్ చేశారో ఆ భఘవంతునికే తెలియాలి. జనసేన అంటూ జనాన్ని ప్రలోభపెట్టి చివరకు సమయం చాలదని తెలుగు దేశం పార్టీకి ఓటెయ్యమని అడుగుతారేమో..అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: