64 కళల్లో ఆరితేరిన కమల్ హసన్ చివరికళగా రాజకీయరంగంలో ప్రవేసించేది నేడే

కమల్ హాసన్ నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టాడు. కమల్ శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానం ఆఖరి కొడుకు. అందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్  అనబడే ఒక మిత్రుడి తో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ పసివయసులోనే చిత్ర రంగం లోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలనుఅభ్యసించారు. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.


భారతదేశపు ప్రముఖ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించి నప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాల నటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ హాసన్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.


నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు శిష్య సంబంధంగా మారింది.

కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాల లో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనేసాటి.  తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.


70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కథా నాయకుడిగా "అవర్‌గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16వయదినిలె   (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.


ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలతో, పాత్రలతో ముందుకు వచ్చారు. కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్- డమ్ పొందాడు. భారతీయుడి సినిమాలో మాజీ సైనికుడిగా అవినీతి అంతానికి కంకణం కట్టుకున్న పాత్రలో కమల్ హాసన్ జీవించారంటే అతిశయోక్తి కాదు. 


చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడం తొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమనులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు.



నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. 2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లో వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.

కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు కీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్రప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.


మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసు కున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.

2005లో కమల్ హసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.


కమల్ హాసన్ వాణి గణపతి వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం తాజాగా ముగించాడు తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


సూపర్ స్టార్ కమల్ హాసన్ తన 63వ జన్మదినం సందర్భంగా నేడే  (9నవంబర్ 7న) రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు.  విషయమై తన అభిమానులతో ఇవాళ చెన్నైలో సమావేశమై తగిన కార్యాచరణకు తుది రూపం ఇస్తున్నారు. తాను మాత్రం రాజకీయ అవినీతి అంతానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కమల్ హాసన్ గతంలో ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేరళ ముఖ్యమంత్రి విజయన్ తో సమావేశమై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు  కమల్ హసన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెపుతొంది ఏపి హెరాల్ద్ 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: