రివ్యూల పై సినీ ప్రముఖులకు ‘గరికపాటి’ షాకింగ్ కౌంటర్..!

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో రివ్యూలపై పెద్ద రగడ మొదలైన విషయం తెలిసిందే.  సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖులు రివ్యూలు రాసే వారిపై నిప్పులు చెరుగుతున్నారు.  సినిమా చూడక ముందే తమ అభిప్రాయాలు రివ్యూ రూపంలో ఇస్తూ ప్రేక్షకులను పక్కదోవ పట్టిస్తున్నారని..థియేటర్లో కూర్చొని సగం సినిమా చూసి సినిమాపై అంచనాలు వేస్తూ రివ్యూలు రాస్తు జనాలను కన్ఫ్యూజ్ లో పెడుతున్నారని అభిప్రాయ పడ్డారు. 

కొట్లు వెచ్చించి సినిమా తెరకెక్కిస్తే..దారినపోయే దానయ్యలు సినిమా మంచి చెడులు నిర్ణయించడం ఏంటీ అని ప్రముఖ హీరో అన్నారు.  సినిమా బాగుంటే..మంచి..లేకుండే చెడు అని రాసే హక్కు రివ్యూ రైటర్స్ కి ఉంటుందని మరో అగ్ర హీరో అన్నారు.  ఏది ఏమైనా కొంత కాలంగా రివ్యూలపై చర్చలే పెద్దఎత్తునే నడుస్తున్నాయి.

తాజాగా రివ్యూలపై  ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కౌంటర్ ఇచ్చారు. హరిద్వార్ వెళ్లి భోజనం చేసిన వ్యక్తికి అక్కడి భోజనం బాగుందో లేదో చెప్పే హక్కు ఉందని అన్నారు. అక్కడి భోజనం బాగా లేదని చెప్పడానికి అతను అక్కడ హోటల్ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలాగే సినిమా చూసిన వారు సినిమా మంచి చెడుల గురించి విశ్లేషించే హక్కు ఉంటుందని..దాని కోసం సినిమానే తీయాల్సిన అవసరం లేదని అన్నారు.  అభిప్రాయం వ్యక్తీకరించే స్వేచ్ఛ అందరికీ ఉందని ఆయన తెలిపారు.

అలాగే వారి మీద అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా ఉందని ఆయన అన్నారు. రెండింటినీ స్వీకరించి, మెరుగైన సమాజాన్ని రూపొందించేందుకు ఉపయోగించాలని ఆయన తెలిపారు.  రాజకీయరంగం ప్రక్షాళన అయితే సమాజం మొత్తం దానంతట అదే బాగుపడుతుందని ఆయన తెలిపారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: