ఆ హీరో తన భార్య తో విడాకులు క్యాన్సిల్ చేసుకున్నాడు .. కారణం ఇదే !
భార్యా భర్తలు విడిపోతున్నారు అనే వార్త వింటే .. వారికి ఎలా ఉంటుందో కానీ చూసేవారికి వినేవారికి మాత్రం కాస్తంత బాధగానే ఉంటుంది. వేద మంత్రాల మధ్యన కలిసిన మొగుడూ పెళ్ళాలు ఎట్టి పరిస్థితి లో విడిపోకూడదు అని అందరం కోరుకుంటాం.
అలాంటిది ఒక సెలెబ్రిటీ కపుల్ విడిపోతూ ఉంటె వారు తిరిగి కలవాలి అనే అందరి ప్రార్ధనలూ ఉంటాయి. అలాంటి ప్రార్ధనలే కన్నడ హీరో సుదీప్ విషయం లో వర్క్ అయినట్టు తెలుస్తోంది.
తన భార్య కి విడాకులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న కన్నడ నటుడు సుదీప్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు. పెళ్లి అయిన 14 వ సంవత్సరం లో సుదీప్ విడాకులు కావాలి అంటూ 2015 లో హై కోర్టు ని ఆశ్రయించాడు.
నిత్యా మీనన్ తో ఇతనికి ఉన్న అఫైర్ కారణంగానే భార్యని వదిలెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు అనే వార్తలు కూడా వినిపించాయి .. కానీ అవన్నీ పుకర్లే అని ఎప్పటికప్పుడు నిత్య, సుదీప్ కొట్టి పారేస్తూ ఉన్నారు. తాజాగా అతను తమ కూతురు సాన్వి కోసం మళ్లీ కలవాలని ప్రస్తుతం సుదీప్ దంపతులు మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్ను కూడా వారిరువురూ వెనక్కి తీసుకున్నారు. సుదీప్ తరఫున ఉన్న న్యాయవాదులు బెంగళూరు ఫామిలీ కోర్టు లో ఈ విషయం చెప్పి మీడియా కి కూడా వివరించారు .