' లై ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... నితిన్ ఎంత ప‌నిచేశావ్‌

VUYYURU SUBHASH
వ‌రుస హిట్ల‌తో ఫామ్‌లో ఉన్న నితిన్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన లేటెస్ట్ మూవీ లై. రిలీజ్‌కు ముందే ట్రైల‌ర్‌, ఆడియో త‌ర్వాత లైపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌త శుక్ర‌వారం రానా నేనే రాజు నేనే మంత్రి, బెల్లంకొండ శ్రీనివాస్ జ‌య‌జాన‌కి నాయ‌క సినిమాల‌కు పోటీగా లై వ‌చ్చేసింది. భారీ అంచ‌నాలు ఉన్న మూడు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.


ఈ మూడు సినిమాల విష‌యంలో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో మూడు సినిమాల‌కు అనుకున్న రేంజ్‌లో థియేట‌ర్లు రాలేదు. ఇక థియేట‌ర్లు పంచుకోవాల్సి రావ‌డంతో పాటు అన్ని సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. అయితే రాజు మంత్రి, జాన‌కి సినిమాల ముందు లై క్ర‌మ‌క్ర‌మంగా తేలిపోయింది.


మ‌ల్టీఫ్లెక్స్‌, ఏ సెంట‌ర్ల ఆడియెన్స్ సినిమాగా లైకు టాక్ రావ‌డంతో అనుకున్న రేంజ్‌లో పెర్పామ్ చేయ‌లేక‌పోయింది. ఇక ఈ పోటీలో రాజు మంత్రి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచి ఇప్ప‌టికే ప్రాపిట్ జోన్‌లోకి వెళ్లిపోతే, జాన‌కి నాయ‌క భారీ బ‌డ్జెట్ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఫైట్ చేస్తోంది. నితిన్ లై మాత్రం ఫ‌స్ట్ వీక్‌కే తేలిపోయింది. 


తొలి వారంలో లైకు ఏపీ, తెలంగాణ‌తో క‌లుపుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేవ‌లం రూ. 9 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. సెకండ్ వీక్‌లో ఈ సినిమా మ‌రింత తేలిపోనుంది. నితిన్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన  ఈ సినిమాకు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. కేవ‌లం రాంగ్ టైమింగ్‌లో పోటీకి వెళ్లి ఈ సినిమాను రిలీజ్ చేయ‌డ‌మే లైకు దెబ్బేసింది.


లై ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్‌:
నైజాం - 2.90 కోట్లు
సీడెడ్‌- 1.08 
వైజాగ్ - 1.05
గుంటూరు - 0.58
ఈస్ట్ - 0.64
వెస్ట్ - 0.34
కృష్ణా - 0.55
నెల్లూరు - 0.25
----------------------------
ఏపీ+తెలంగాణ = 7.39
-----------------------------
రెస్టాఫ్ ఇండియా - 0.65
రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ - 0.70
-------------------------------------------------------
టోట‌ల్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 8.74 కోట్లు
---------------------------------------------------------
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: