ఓవర్సీస్ లో దూసుకెళ్తున్న ఫిదా.. మిలియన్ క్లబ్ లో వరుణ్ తేజ్

shami
మెగా హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ తేజ్ ఎన్నారైగా నటించిన ఈ సినిమాలో తెలంగాణా అమ్మాయిగా సాయి పల్లవి తన సహజ నటనతో ఆకట్టుకుంది.


ఇక మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ లోనే 1 మిలియన్ డాలర్ కలక్షన్స్ వసూలు చేసేలా పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవర్సీస్ లో 113 సెంటర్స్ లో సినిమా రిలీజ్ అవగా శుక్రవారం రోజునే 2,16,000 డాలర్లు వసూలు చేయడం విశేషం. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఫిదా మంచి కలక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది.


మెగా హీరోగా వరుణ్ తేజ్ కెరియర్ లో కమర్షియల్ హిట్ గా ఫిదా నిలుస్తుందని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా వచ్చిన ఫిదా ఎంతో సహజమైన కథ కథనాలతో ఆకట్టుకున్నారు. శుక్రవారం ప్రీమియర్స్ తో కలిసి 3,00,000 డాలర్స్ వరకు వచ్చాయని తెలుస్తుంది. ఇక మరో పక్క ఫుల్ రన్ లో సినిమా ఓవర్సీస్ లోనే 1.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


వరుణ్ తేజ్ కెరియర్ లో ఫిదా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫిదా మూ
వీ వసూళ్ళ హవా కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి రోజు 3 కోట్ల అటు ఇటుగా కలక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ ఎంత బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: