తన కుటుంబానికి రూ.40 కోట్లు చాలట..!

Edari Rama Krishna
ఈ మాట అంటుంది ఏవరో కాదు 90వ దశకంలో తెలుగు చిత్రపరిశ్రమలో  ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు.  తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ప్రముఖ నిర్మాత జగపతి సంస్థ అధినేత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడు గా  సినీ రంగంలోకి అడుగుపెట్టిన జగపతి.  అప్పట్లో మంచి ఫ్యామిలీ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  అయితే జగపతి బాబు ఎన్ని సినిమాలు తీసినా పెద్దగా బ్రేక్ మాత్రం రాలేదు.

అంతే కాదు ఆ మద్య కొన్ని ఆర్థిక సమస్యలతో సతమతమైనట్లు వార్తలు వచ్చాయి. ఒకదశలో సినీ ఇండస్ట్రీకి దూరం కావాలనుకున్న ఈయనకు బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంలో విలన్ పాత్రలో నటించి ఔరా అనిపించుకున్నాడు.  అప్పటి వరకు హీరోగా చూసిన జగపతిబాబుని విలన్ గా చూడగలమా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ..బాలకృష్ణతో సమానంగా నటించి మెప్పించాడు.  దీంతో ఒక్కసారే అదృష్టం కలిసి వచ్చింది..వరుసగా విలన్, క్యారెక్టర్ పాత్రలతో విపరీతమైన డిమాండ్ తెచ్చుకున్నాడు.

తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో బిజీ నటుడిగా మారిపోయారు. కోట్లల్లో పారితోషకం తీసుకుంటూ బాగానే సంపాదిస్తూ ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకున్నారు. త్వరాలో జగపతిబాబు నటించిన ‘పటేల్ సార్’ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదని..అంతే కాదు తనకు రూ.40 కోట్లుంటే చాలనిపిస్తుంది.  ఎందుకంటారా..తన కుటుంబ సభ్యులు నలుగురు మాత్రమే..తలా ఓ పది కోట్లు ఉంటే చాలు లైఫ్ గడిచిపోతుంది అంటున్నారు.

మనిషికి డబ్బులు అవసరమే... కానీ కోట్లకు కోట్లు ఏం చేసుకుంటాం. విలన్.. క్యారెక్టర్ రోల్స్ తో బండి సాఫీగా సాగిపోతున్న సమయంలో మళ్లీ హీరోగా ‘పటేల్ సార్’ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘ఈ చిత్రంలో తాను హీరోగా క్రెడిట్ సంపాదించడానికి కాదని కథ చాలా అద్భుతంగా ఉందని..ఈ కథను తాను సూట్ అవుతానే ఉద్దేశ్యంతోనే ఒప్పుకున్నానని అంటున్నారు. అంతే కాదు ఎప్పుడే ఒకేలాంటి పాత్రలు చేసినా బోర్ కొడుతుందని అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు కూడా వేయాలని వేదాంతం చెబుతున్నారు జగపతిబాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: