తమిళ డైరెక్టర్ ని వణికించిన మహేష్
ఇక సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో మాత్రం ఈ మూవీ డైరెక్టర్ పై పూర్తిగా నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ తరువాత మహేష్ బాబు `శ్రీమంతుడు` కాంబినేషన్లో నటించాల్సి ఉంది. కొరటాల శివ ఇప్పటికే చాలా నెలల నుండి మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు...డైరెక్టర్ మురుగదాస్ పై సీరియస్ అయ్యాడంట.
కొద్ది రోజుల్లో `స్పైడర్` మూవీ షూటింగ్ ని పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడని తెలుస్తుంది. దీంతో మురుగదాస్ సైతం ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. తను కంటిన్యూస్ గా డేట్స్ ఇస్తున్నప్పటికీ...అనుకున్న టైంలో ఎందుకు షూటింగ్ పూర్తి కావటం లేదు? అనేది మహేష్ బాబు ప్రశ్న. దీంతో మురుగదాస్ ఈ మూవీని పూర్తి చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది.