పుష్ప ఫస్ట్ సింగిల్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన , అల్లు అర్జున్ కి జోడిగా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఫహద్ ఫజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని 2024 ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క టీజర్ ను విడుదల చేశారు. ఇక తాజాగా ఈ మూవీ లోని మొదటి పాటను విడుదల చేశారు. "పుష్ప పుష్ప" అంటూ సాగే ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 10.38 మిలియన్ వ్యూస్ ను ,  564.2 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని మొదటి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించినప్పటికీ ఈ మూవీ మొదటి సాంగ్ కొన్ని రికార్డులను చెరిపేస్తుంది అని కొంత మంది అనుకున్నారు. ఆ స్థాయి రెస్పాన్స్ ను మాత్రం ఈ సాంగ్ తెచ్చుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: