విలన్ గా ఎన్టీఆర్.. వెరీ ఇంట్రెస్టింగ్..!

shami

ఏంటి యంగ్ టైగర్ విలన్ గానా..? ఇది నిజమేనా..? టైగర్ విలన్ అయితే మరి హీరో ఎవరు అంటే.. హీరో విలన్ అన్ని తానై నడిపించాలని కొత్త కథతో వస్తున్నాడు జూనియర్ ఎన్.టి.ఆర్. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మంచి జోష్ లో ఉన్న తారక్ కొద్దిపాటి గ్యాప్ తో బాబి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ విలన్ గా కూడా నటిస్తాడని ఎక్స్ క్లూజివ్ టాక్.

 

ప్రస్తుతం స్టార్ హీరోలు హీరోలుగానే కాదు విలన్ గా కూడా ఇరగదీస్తున్నారు. కోలీవుడ్ హీరోలు విక్రం, సూర్యలు ఇప్పటికే అటు హీరోలుగానే కాదు అదే సినిమాలో విలన్ గా కూడా తమ ప్రతాపం చూపించారు. అయితే ప్రస్తుతం బాబి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న మూవీలో ఒక పాత్ర విలన్ గా నటిస్తున్నాడట. తన విలనిజం చూపించడానికి రెడీ అయిన తారక్ సినిమా కోసం ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నాడట.


ఇక మిగిలిన రెండు పాత్రల్లో ఒకటి కామెడీ పాత్ర కాగా మరోటి పోలీస్ పాత్రని తెలుస్తుంది. సో మొత్తానికి ఎన్.టి.ఆర్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో బాబి సినిమాలో నటిస్తున్నాడన్నమాట. ఎలాంటి పాత్రనైనా సరే తన అభినయంతో వారెవా అనిపించే తారక్ విలన్ గా ఎలా ఉంటాడో చూడాలి. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. సినిమా టైటిల్ గా జై లవ కుశ పెట్టే ఆలోచనలో ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: