క్షణానికో లక్ష అంటున్న నయనతార

K Prakesh
నయనతార ఏమి చేసినా సంచలనమే. ప్రేమ దగ్గర నుండి సినిమాల వరకూ నయన కు సంబంధించిన న్యూస్ హట్ టాపిక్ గా ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెతకు నిదర్శనంగా ప్రస్తుతం నయన్ వరసపెట్టి సినిమాలు చేస్తుండడమే కాకుండా పారితోషికం విషయంలో కూడా తన మార్క్ ను నిర్మాతలకు చూపెడుతూ చుక్కలు చూపిస్తోంది. నయనతార ఏమిటి, ఇంత కమర్షియల్ గా అయిపోయింది అంటూ కోలీవుడ్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి.

నయనతార ను ఈనేలాఖరున అమెరికాలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఒక ప్రోగ్రాం కు ముఖ్య అతిధి గా పిలిచారట. అదే కార్యక్రమంలో బాలకృష్ణ కు కూడా జీవన సాపల్య పురష్కారం ఉంది. అయితే ఆ సభకు ముఖ్య అతిధిగా హాజరు కావడానికి నయన అడిగిన పారితోషికం ఆ సభ నిర్వాహకులను గుండెలు అదిరిపోయలా చేసిందట. నిమిషానికి లక్ష రూపాయల చొప్పున ఆ సభలో తాను ఎన్ని నిమిషాలు ఉండవలసి వస్తే అన్ని లక్షలు పుచ్చుకుంటానని పక్కా కమర్షియల్ గా చెప్పిందట నయన్. ఈ పారితోషికం కాకుండా తనకు రానుపోనూ విమాన ఖర్చులు, అక్కడ వసతి, అదనం అని కూడా మొహమాటం లేకుండా చెప్పేసిందట నయన్.


 అమెరికాలోని ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న సభ కాబట్టి ఆ మాత్రం రేంజ్ ఉండాలని నయన అభిప్రాయం అయి ఉండవచ్చు. కాని ముఖ్య అతిధిగా నయనతార ఉంటే ఆ సభకు వచ్చే కళ వేరని నిర్వాహకులు ఆలోచిస్తూ నయనతార పెట్టిన షరతులకు మన ప్రవాసాంధ్రుల సంఘం ఒప్పుకుందని తెలుస్తోంది.  సెలబ్రిటీల మోజులో మన ప్రవాసాంధ్రులు కూడా ఇటువంటి షరతులకు అంగీకరిస్తూ ఉన్నారు కాబట్టే మన గ్లామరస్ సెలబ్రిటీ లకు ఆడిందే ఆట పాడిందే పాటగా చేల్లిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: