సమంతకి ఏమైంది?

HANUMA HANUMA
సమంత ఇప్పటి దాకా ఒప్పుకున్న ప్రతి తెలుగు సినిమా హిట్టే. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ఇటీవల రెండు పెద్ద చిత్రాలను వద్దనుకుంది. ఒకేసారి శంకర్, మణిరత్నం చిత్రాల్లో నటించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు. సమంత ఆ అవకాశాన్ని కావాలనే వదులుకుంది. జూలై 20 నుంచి తాను రెగ్యులర్ షూటింగ్ కు వస్తానని చెప్పింది. కానీ రాలేదు. అసలు బంగారం లాంటి అవకాశాన్ని ఆమె ఎందుకు వదులుకుంటోంది. క్రేజీ ప్రాజెక్టులు ఆమె కాల్షీట్ కోసం ఆగి వున్నాయి. స్కిన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆమె ఏకబిగిన ఇన్ని ప్రాజెక్టులను పూర్తి చేయగలదా? ఇంతకీ ఆమెకు వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్ ఏంటి? అక్కినేని నాగేశ్వరరావు అంతటి వాడే సావిత్రి తర్వాత అంతటి అందమైన స్కిన్ ను తను సమంతలోనే చూశానని కితాబిచ్చారు కదా. అంత అందమైన స్కిన్ కు ఏమైంది? అసలు ఆమె కెరీర్ ను కంటిన్యూ చేయగలదా? అంతదాకా ఎందుకు... ఒప్పుకున్న సినిమాలనైనా పూర్తి చేయగలదా? వంటి సందేహాలను పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా సమంత వెలుగులోకి వచ్చి జవాబు చెప్తే గానీ వీటన్నిటికీ సమాధానం దొరకదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: