వేసవిలో జంజీర్

Chowdary Sirisha
నాయక్ ఫలితం తేలిపోయింది కాబట్టి... చరణ్ దృష్టి ఇకమీదట జంజీర్ మీదనే ఉంటుందంటున్నారు సన్నిహితులు. అవును పాపం... ఏం చేస్తాడు మరి. కనీసం బాలీవుడ్ లోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కదా మరి. ఎందుకంటే... ప్రియాంకా చోప్రాతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు మరి. కనీసం ఈసారైనా హిట్టు కొట్టాలనుకుంటున్నాడు. నిజానికి, జంజీర్ షూటింగ్ జరుగుతూ ఉండాల్సిందే. కానీ, నాయక్ మీద చెర్రీ చాలా ఆశలే పెట్టుకుని దానికే ఎక్కువ టైమ్ కేటాయించాడు. దాంతో జంజీర్ వెనక్కు వెళ్లిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో షూటింగ్ చేసేసి దీన్ని ఏప్రిల్ లో విడుదల చేసేయాలని అనుకున్నారు ఈ చిత్ర నిర్మాతలు. కానీ, అలా జరగలేదు. సంక్రాంతితో కలుపుకుంటే దాదాపుగా జనవరి సగం నెల అయిపోయింది. సో, ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల చేయలేమని తెలుసుకున్నారు. మే నెలలో దీన్ని వేసవి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. కనీసం అక్కడైనా చెర్రీని అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: