నాని ఖాతాలో మరో సూపర్ హిట్..!

shami
నాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాధ.. ఒక రెండు సంవత్సరాల క్రితం దాకా తనకున్న ఇమేజ్ దృష్ట్యా కథల ఎంపిక లోటు పాట్ల వల్ల రేసులో వెనుక పడ్డ్ నాని లాస్ట్ ఇయర్ వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఆ సినిమాలో మారుతి మార్క్ డైరక్షన్.. నాని మార్క్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కాసుల వర్షం కురిపించేలా చేశారు. అయితే ఆ సినిమాతో నాచురల్ స్టార్ ట్యాగ్ లైన్ తగిలించుకున్న నాని తర్వాత సినిమా కోసం మరింత కష్టపడ్డాడు.


ప్రస్తుతం లేటేస్ట్ సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాధ.. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా షో పడిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా నాని నటన హైలెట్ అవుతూ వచ్చిన ఈ సినిమాలో దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ సూపర్బ్ అనేలా చేసింది. ఇక హీరోయిన్ గా నటించిన మెహెరిన్ తన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.


కేవలం ప్రివ్యూ టాక్ తోనే సూపర్ హిట్ అనేసేలా ఉందంటే సినిమా కచ్చితంగా సాధారణ ప్రేక్షకులకు నచ్చుతుంది అని చెప్పొచు. 14 రీల్స్ బ్యానర్లో రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకరలు నిర్మించిన ఈ సినిమా నానికి మరో హిట్ తన ఖాతాలో పడేలా చేసింది. సినిమా రిలీజ్ పోస్టర్ నుండి మంచి హైప్ వచ్చేలా చేసి సినిమా కథ కథనాల్లో కూడా మంచి ట్విస్ట్ లతో సాగించి సినిమా కేక అనేలా చేశారు.


సో ఈ వరుసలో నాని సినిమా సూపర్ హిట్ అంటే మళ్లీ వసూళ్ల సునామి సృష్టించినట్టే. మొత్తం 11 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడ్డ ఈ సినిమా 15 కోట్లకు అమ్ముడయ్యింది. ఇక శాటిలైట్ రైట్స్ అవి ఇవి కలిపి రిలీజ్ కు ముందే 20 కోట్లకు అమ్మడయిన ఈ సినిమా కచ్చితంగా లాభాలను తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు. సినిమా ఎలాగు హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి నాని మరోసారి సంచలన విజయం దక్కించుకున్నట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: