నేషనల్ మీడియాపై మండిపడ్డ సిద్దార్థ..!!

Edari Rama Krishna
తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ‘బాయ్స్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో సిద్దార్థ. తర్వాత తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం మంచి హిట్ సినిమాలు.  తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. సిద్దార్థ బాలీవుడ్ లో కూడా నటించాడు. తాజాగా హీరో సిద్దార్థ నేషనల్ మీడియాపై ఫైర్ అయ్యాడు.  నార్త్ ఇండియాలో ఓ మనిషి చనిపోయినా పెద్ద  మీడియాలో హల్ చల్ చేస్తారని మరి సౌత్ లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా ఏమాత్రం స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత రెండు వారాలుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించి పోయింది. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయి. చెన్నై లాంటి పెద్ద నగరంలోనే చాలా ఏరియాలో మునిగిపోయి ఉన్నాయి. ఈ వార్తలు నేషనల్ మీడియాలో పెద్దగా హైలైట్ కావట్లేదు. రోజులో ఒక్కసారి రావడమే మహా గగనం అయ్యింది.

తమిళనాడులో వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు


మరోవైపు ముంబాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి..ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం దానిపైనే ఫోకస్ చేసిందని రోజంతా అవే న్యూస్ ప్రసారం చేస్తుందని వాపోయారు.  భారత దేశం అని ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డా వారి బాధను వెలుగులోకి తీసుకు వచ్చే బాధ్యత మీడియాదే అని అలాంటి మీడియా వివక్ష చూపించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులోని పరిస్థితి దేశానికి తెలియజేసి సాయం అందేలా చూడాలని అతను నాలుగైదు రోజుల నుంచి ట్విట్టర్ లో కోరుతున్నాడు.


సిద్దార్థ ట్విట్ :

Still no coverage. People have died. Daily life's been affected. More rain to come. What more do you want? #PARTOFINDIA #NATIONALMEDIA #why

— Siddharth (@Actor_Siddharth) November 24, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: