12A రైల్వే కాలనీ: అల్లరోడి సినిమా హిట్టా ఫట్టా..!
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి,
డైరెక్షన్: నాని కాసరగడ్డ.
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేటువంటి అల్లరి నరేష్ ప్రస్తుతం తన పంతాను మార్చుకున్నారు. నంది సినిమా నుంచి మొదలు ప్రస్తుత 12A రైల్వే కాలనీ వరకు మాస్ యాక్షన్ చిత్రాలతో అదరగొడుతున్నారు. అయితే తాజాగా వచ్చిన 12Aరైల్వే కాలనీ ఏ విధంగా ఉంది వివరాలు చూద్దాం..
స్టోరీ:
విశ్లేషణ:
12 ఏ రైల్వే కాలనీలో తల్లి కూతుర్లైన ఇద్దరు చాలా ఆశ్చర్యకరంగా హత్యకి గురవుతారు. వీరిలో ఒక హీరోయిన్ కూడా ఉంటుంది.. అయితే వీరి మరణాన్ని హీరో ఎలా కనిపెట్టాడు అనేది అసలు స్టోరీ.. అయితే ఈ మిషనరీని పోలీసులు ఛేదించకపోవడంతో, రంగంలోకి దిగినటువంటి హీరో తన తెలివితో నిందితులను పట్టుకుంటాడు. ఇక పోలీసులేమో కొంతమంది అనుమానితులను పిలవడం,వాళ్ళు ఏదో ఒక ప్రూఫ్ చూపించడంతో విడిచిపెట్టడం వంటివి చేస్తూ ఉంటారు.. ఈ విధంగా దోషులు పోలీసులకు లంచం ఇవ్వడం కనిపెట్టిన హీరో దాన్ని పట్టుకొని, మొత్తం కూపీ లాగుతాడు. ఈ క్రమంలో జరిగే ట్విస్టులు.. స్టోరీ చుట్టూ కథను అల్లిన తీరు చూస్తే అందరూ షాక్ అవుతారు..
నటీనటుల పర్ఫామెన్స్:
ఇక ఇందులో అల్లరి నరేష్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు కామెడీ అనే ఇమేజ్ నుంచి అల్లరి నరేష్ బయటకు వచ్చి కార్తీక్ లాంటి పాత్ర చేయడం అందరికీ నచ్చుతుంది. ఇక తెలంగాణ యాసలో అదరగొట్టేస్తాడు. ఇక కొన్ని వల్గర్ డైలాగులు కొంతమంది ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. మొత్తానికి నరేష్ పర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. ఇక కామాక్షి భాస్కర్లకు మంచి పాత్ర దక్కింది.. ఆమె యాక్టింగ్ కు సినిమా చూస్తున్న ప్రేక్షకులు కదలిపోవాలి. కానీ అలాంటి ఫీలింగ్ ఏమి ప్రేక్షకులకు కలగలేదు. అయితే ఈ ప్రాబ్లం డైరెక్షన్ చేసిన దర్శకుడిదని చెప్పవచ్చు. ఇక గెటప్ శీను తనదైన శైలిలో బాగా నటించారు. ఇక పొలిటీషియన్ టిల్లు పాత్రలో జీవన్ ఓకే అనిపించారు. అభిరామి కాసేపే కనిపించిన అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా ఎవరి పాత్రలో వారు అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే..ఈ సినిమాలో సంగీతం చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు. సెకండాఫ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఇక నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.
రేటింగ్:2/5