ఫ్యామిలీ స్టార్ రివ్యూ: ఇది పోయినట్టేనా?

Purushottham Vinay
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ-పరశురామ్ మళ్లీ కలిసి చేసిన సినిమా.. ఫ్యామిలీ స్టార్. మృనాల్ టాకూర్ హీరోయిన్ గా నటించింది.దిల్ రాజు బేనర్లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ఉందా.. 'గీత గోవిందం' మ్యాజిక్ ను 'ఫ్యామిలీ స్టార్' రిపీట్ చేస్తుందా.. తెలుసుకుందాం.


ఇది గీతాగోవిందం రేంజ్ మూవీ కాదు. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంది.సెకండాఫ్‌ కొంచెం పర్వాలేదు కానీ బోరింగ్ సీన్స్ ఎక్కువున్నాయి.అక్కడక్కడ టీవీ సీరియల్‌ ఫీలింగ్‌ వస్తుంది.ఈ సినిమా ఫస్టాఫ్‌ కమర్షియల్ అంశాలతో ప్లాన్‌ చేసిన దర్శకుడు..సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్‌ ట్రాక్‌ను ఎంచుకుని కొంచెం మంచిపని  చేశాడు. సినిమాలో ఫ్యామిలీకి బాగా కనెక్ట్‌ అయ్యే సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయి. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని డైరెక్టర్ చక్కగా చూపించారు.గీత గోవిందం సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్‌, కామెడీ.. కానీ ఈ సినిమాలో మ్యూజిక్‌ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి పెద్దగా ఏమి ఎక్కవు.కథ, డైలాగ్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కొంతవరకు సినిమా బాగున్నా ఆ తరువాత చాలా బోరింగ్ గా ఉంటుంది.మొత్తానికి ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం చాలా కష్టం.


అనవసరమైన రిపీటెడ్ సీన్స్‌తో సినిమా ఓపికకు పరీక్ష పెడుతుంది. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే విజయ్, మృణాల్ తప్ప మిగిలిన నటీనటుల పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా లేదు. విజయ్  అభిమానులతో పాటు మిడిల్‌ క్లాస్‌ అభిమానులకు అయితే ఒకే. కానీ మరీ అంత హిట్ కంటెంట్ అయితే ఏమి లేదు. మృనాల్ కి ఇంతవరకు తెలుగులో ఒక్క ప్లాప్ లేదు. ఆమె నటించిన గత రెండు సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆమెకి ఎలాంటి ప్లస్ అవ్వదు. ఇంకా మైనస్ అవుతుంది.డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఇలాంటి సినిమా తీస్తారని అస్సలు అనుకోలేదు. ఆయన సినిమాల్లో కథ ఎలా ఉన్నా కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ మాత్రం బాగుంటాయి. అవి కూడా ఈ సినిమాలో కనపడవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: