జోరు : రివ్యూ
సందీప్ (సందీప్ కిషన్) వైజాగ్ లో ఉండే ఒక కుర్రాడు, అతను అనుకోకుండా ఆ ఊర్లో రౌడీ అయిన భవాని (అజయ్) తో గొడవ పడతాడు. పద్దెనిమిది ఏళ్ల తరువాత అను (రాశి ఖన్నా) అమెరికా నుండి తండ్రి సదాశివం(షియాజీ షిండే) ని కలవడానికి వస్తుంది. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తున్న సమయంలో సందీప్ మరియు అను కలుస్తారు. అదే సమయంలో అనుని చంపించడానికి భవాని ప్రయత్నిస్తుంటాడు. అందులో నుండి సందీప్ ఆమెను కాపాడుతుంటాడు. ఇలా సాగుతుండగా అను కి పరమశివం గురించి తెలుస్తుంది. భవాని సదాశివం కొడుకు అని తెలుస్తుంది. తన చెల్లలినే చంపాలని భవాని ఎందుకు అనుకుంటాడు? అసలు పరమశివం ఎవరు? సందీప్ అను ని ఎలా కాపాడాడు? ఈ కథ మొత్తానికి పెళ్లి కొడుకు అలియాస్ PK(బ్రహ్మానందం) కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగిలిన కథ...
సందీప్ కిషన్ నటించడానికి ఆస్కారం లేని పాత్ర ఇది కాబట్టి అయన పరిగెట్టడం , డాన్స్ వెయ్యడం , ఫైట్ లు చెయ్యడం వంటి వాటి మీద దృష్టి సారించారు. వాటిలో బాగానే రాణించాడని చెప్పుకోవచ్చు.. కొన్ని సన్నివేశాలలో సందీప్ కిషన్ టైమింగ్ బాగుంది.. కాని ఇలాంటి పాత్రలను మునుముందు ఎందుకోకపోవడమే మంచిది.. రాశి ఖన్నా పాత్ర కీలకం అయినది కాని ఈ నటికి ఆ స్థాయిలో నటించే అవకాశం రాలేదు.. కాని ఈ చిత్రంలో హైలెట్స్ చెప్పమంటే రాశి ఖన్నా పేరే ముందు చెప్పుకోవాలి.. ఆమె అందాలతో చాలావరకు ఆకట్టుకుంది... సుష్మ రాజ్ పాత్ర కూడా కీలకమే కాని అవసరానికి మించి ఆమె చూపించిన నటన శ్రుతి మించిన ఆమె అందాల ఆరబోత ఆమె పాత్ర ప్రాముఖ్యత మొత్తం కోల్పోయింది.. ప్రియ బెనర్జీ పాత్ర పూర్తిగా అందాల అరబోతకె పరిమితం అయ్యింది.. బ్రహ్మానందం పాత్ర చిత్ర కథకి ఏ మాత్రం సంభంధం ఉండదు కాని చిత్రంలో ఎక్కువసేపు కనిపించే పాత్ర ఇదే.. కొన్ని సన్నివేశాలలో కామెడీ బాగా పండింది కాని చాలా సన్నివేశాలు బాగా చిరాకు పెట్టించింది. ఇంతకన్నా చిరాకు పెట్టిన విషయం సప్తగిరి చేసిన కామెడీ, మొదటి అర్ధ భాగంలో ఈ నటుడి చేసిన కామెడీ చాలా చిరాకు పెట్టించింది.. అజయ్ పాత్ర చిత్రంలో మూడు సన్నివేశాలకే పరిమితం అయ్యింది.. ఆ సన్నివేశాల వరకు ఆకట్టుకున్నారు.. బాలయ్య , అన్నపూర్ణ, పృథ్వి రాజ్ మొదలగు నటీనటులు కనిపించారు కాని గుర్తించే స్థాయిలో అయితే లేవు...
గతంలో "గుండెల్లో గోదారి" వంటి చిత్రాన్ని తెరకెక్కించిన కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి కథ కథనం దర్శకత్వం అందించారు.. కథ అని చెప్పుకోడానికి ఈ చిత్రంలో ఎం లేదు , కథనం విషయానికి వస్తే చిత్రంలో బలమయిన సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు. కామెడీ అన్న పేరుతో ఈ చిత్రంలో చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు, మొదటి అర్ధ భాగంలో ఎలుగుబంటి కామెడీ గురించి చెప్పుకోకపోవడమే మంచింది.. రెండవ అర్ధ భాగంలో బ్రహ్మానందం తో చేసిన కామెడీ మరియు రెడీ నుండి తీసుకున్న సన్నివేశాలు ఇలా చెప్పుకోడానికి కూడా నీరసం వచ్చే అంశాలతో కథనాన్ని నింపి వేసాడు దర్శకుడు.. మాటల గురించి మాట్లాడుకోడమే మంచిది.. ఒక్కటి కూడా సన్నివేశానికి బలం ఇవ్వలేదు కామెడీ పండించలేదు చాలా సరళంగా అంతే నీరసంగా ఉంటాయి సంభాషణలు.. పళని అందించిన సినిమాటోగ్రఫీ గొప్పగా లేదు అనవసరమయిన స్లో మోషన్ షాట్స్ , క్లోజ్ అప్ షాట్స్ , అనవసరమయిన లైటింగ్ ఇలా ఈయన స్థాయికి తగ్గ హింస ఈయన పెట్టాడు... భీమ్స్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి నేపధ్య సంగీతం అసలు నప్పలేదు.. ఎడిటింగ్ విభాగంలో శేఖర్ ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది చాలా సన్నివేశాలు తల తోక లేనట్టు ఉంటాయి.. శ్రీ కీర్తి వారి నిర్మాణ విలువలు అంతంతమాత్రమే ఉంది..
ఒక చిత్రాన్ని ఎలా మొదలు పెట్టాలో ఎలా ముగించాలో తెలియక కేవలం ముగిచాలని మాత్రమే చిత్రాన్ని అయిపోనిచ్చిన చిత్రం జోరు. పేరుకి పది పాత్రలు కనిపిస్తుంటాయి అందులో సుమారు మూడు పాత్రలు కీలకం అయినవి కాని వాటికి ప్రాముఖ్యత ఎక్కడా కనిపించదు. చిత్రంలో చాలా చిత్రాల పోలికలు కనిపిస్తాయి , రెడీ, బంపర్ ఆఫర్ మొదలగున చిత్రాలను పోలిన సన్నివేశాలు కోకొల్లలు... అజయ్ పాత్ర ఏమయ్యింది , రాశి ఖన్నా , సందీప్ కిషన్ ని ఎందుకు ప్రేమిస్తుంది.. చేజ్ జరుగుతుండగా మధ్యలో BMW కార్ రెనాల్ట్ కార్ లాగా ఎలా మారిపోయింది? రాత్రి పల్సర్ బైక్ పొద్దున్నకి పాషన్ ఎలా అయ్యింది? లాంటి ప్రశ్నలు అడగొద్దు అని టైటిల్ కార్డ్స్ దగ్గర వేసి ఉంటె బాగుండేది.. ఒక కామెడీ సన్నివేశం , ఒక రొమాంటిక్ సన్నివేశం, ఒక సెంటిమెంట్ సన్నివేశం వెంటనే ఒక ఫైట్ ఇలా ప్రతీది ప్రేక్షకుడిని కష్టపెట్టేవే కాని ఆకట్టుకునేవి ఒక్కటి కూడా లేదు. పాటల చిత్రీకరణ విషయంలో చిత్రం కాస్త మెరుగ్గా కనిపించింది. జోరు అని పేరులో ఉంది కాని చిత్రం ఒక్క నిమిషం కూడా జోరుగా సాగదు.. జోరు - ప్రేక్షకుల ఆర్తనాదాల హోరు - చూస్తే అవుతారు బేజారు - ఇది ఈ చిత్రం తీరు ...
Sundeep Kishan,Raashi Khanna,Kumar Nagender,Nagarjuna,Bheems Sisiroleo .చివరగా : జోరు : - బహు బోరు ...మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
BMW
-
Telugu
-
Cinema
-
raasi
-
Music
-
Visakhapatnam
-
Vishakapatnam
-
American Samoa
-
Father
-
Hyderabad
-
sandeep
-
marriage
-
Sambandam
-
sundeep kishan
-
raashi khanna
-
Rashi Khanna
-
raj
-
benarjee
-
brahmanandam
-
Comedy
-
saptagiri
-
ajay
-
Balakrishna
-
prudhvi raj
-
kumar nagendra
-
Kathanam
-
Palani
-
sekhar
-
sree
-
Chitram
-
Car
-
Bike
-
Romantic