రెబల్ : మ్యూజిక్ రివ్యూ

Prasad
డాన్స్ డైరెక్షన్ నుంచి నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా మారి తన ప్రతిభ చూపిస్తున్న లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా రెబల్. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా, ఈ రెబల్ సినిమా పాటలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డాన్ సినిమా తరువాత లారెన్స్ సంగీతం అందించిన ఈ రెబల్ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి పాట : కేక కేక... ఈ పాటకు రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. లైయాడ్ పౌల్, సత్య అలపించారు. అమ్మాయి అందాలను వర్ణిస్తూ అబ్బాయి పాడే పాటగా ఈ గీతం సాగుతుంది. రెండవ పాట : దీపాలి. ఈ పాటకు రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. కార్తీక్, ప్రియ హేమేష్, దివ్యా అలపించారు. ప్రేయసి ప్రియడు మధ్య సాగే గీతంగా అనిపిస్తుంది. మూడవ పాట : గూగుల్.. ఈ పాటను భాస్కరభట్ల రాయగా అండ్రే జీరేవయ్య, శ్రావణ భార్గవి గానం చేశారు. నాలుగవ పాట : ఓరి నాయన... రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటను మాలతి, విజయ్ ప్రకాశ్ అలపించారు. మాస్ జనం కోసం ఉద్దేశించిన ఈ పాటను మాలతి, విజయ్ ప్రకాశ్ అదే ఊపుతో పాడారు. ఐదవ పాట : ఎక్స్ లెంట్ నీ ఫిగరూ... ఈ పాటను నకాష్ అలపించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ అల్బమ్ కు మొదటి లో ఉన్న కేక కేక.. పాటకు రీమిక్స్ గా సాగుతుంది. ఈ రెబల్ ఆల్బమ్ లో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. సాధారణ సంగీతం సాగే ఈ పాటలు వినే కొద్ది బాగానే అనిపిస్తాయి. చిత్రీకరణ తో అభిమానులను మరింతగా ఆకట్టుకోవచ్చు. ఇతరుల పాటలనే తన నృత్య దర్శకత్వం తో అందంగా తీర్చిదిద్దే లారెన్స్ తన స్వంత పాటలను మరింత ఆకర్షణీయంగా తెరకెక్కిస్తాడని ‘రెబల్’ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.    " height='150' width='250' width="560" height="315" src=" https://www.youtube.com/embed/IEJw2DrmEjg" data-framedata-border="0" allowfullscreen STYLE="margin-left:30px"> డాన్స్ డైరెక్షన్ నుంచి నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా మారి తన ప్రతిభ చూపిస్తున్న లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా రెబల్. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా, ఈ రెబల్ సినిమా పాటలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డాన్ సినిమా తరువాత లారెన్స్ సంగీతం అందించిన ఈ రెబల్ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి పాట : కేక కేక... ఈ పాటకు రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. లైయాడ్ పౌల్, సత్య అలపించారు. అమ్మాయి అందాలను వర్ణిస్తూ అబ్బాయి పాడే పాటగా ఈ గీతం సాగుతుంది. రెండవ పాట : దీపాలి. ఈ పాటకు రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. కార్తీక్, ప్రియ హేమేష్, దివ్యా అలపించారు. ప్రేయసి ప్రియడు మధ్య సాగే గీతంగా అనిపిస్తుంది. మూడవ పాట : గూగుల్.. ఈ పాటను భాస్కరభట్ల రాయగా అండ్రే జీరేవయ్య, శ్రావణ భార్గవి గానం చేశారు. నాలుగవ పాట : ఓరి నాయన... రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటను మాలతి, విజయ్ ప్రకాశ్ అలపించారు. మాస్ జనం కోసం ఉద్దేశించిన ఈ పాటను మాలతి, విజయ్ ప్రకాశ్ అదే ఊపుతో పాడారు. ఐదవ పాట : ఎక్స్ లెంట్ నీ ఫిగరూ... ఈ పాటను నకాష్ అలపించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ అల్బమ్ కు మొదటి లో ఉన్న కేక కేక.. పాటకు రీమిక్స్ గా సాగుతుంది. ఈ రెబల్ ఆల్బమ్ లో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. సాధారణ సంగీతం సాగే ఈ పాటలు వినే కొద్ది బాగానే అనిపిస్తాయి. చిత్రీకరణ తో అభిమానులను మరింతగా ఆకట్టుకోవచ్చు. ఇతరుల పాటలనే తన నృత్య దర్శకత్వం తో అందంగా తీర్చిదిద్దే లారెన్స్ తన స్వంత పాటలను మరింత ఆకర్షణీయంగా తెరకెక్కిస్తాడని ‘రెబల్’ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: