రోజులు మారాయి : రివ్యూ

ఫస్ట్ హాఫ్ కామెడీ, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ఫస్ట్ హాఫ్ కామెడీ, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్కథ, కథనం, డైరక్షన్ ,సెకండ్ హాఫ్

అశ్విత్ (చేతన్) ఓ పెద్ద కుటుంబానికి సంబందించినవాడు.. అమ్మకు దూరంగా ఉంటున్న చేతన్ ఆద్య (కృతిక) లవ్ లో పడతాడు. కృతిక మీద ఉన్న ప్రేమను బయట పెట్టి తనకో డైమండ్ రింగ్ ఇస్తాడు చేతన్.. అది కాస్త అమ్మేసి ఓ రెండు గోల్డ్ చైన్స్ తీసుకుని ఒకటి తనను ప్రేమించే చేతన్ కు.. మరోటి తను ప్రేమించే విక్కికి ఇస్తుంది. ఇక మరో పక్క రంభ (తేజశ్వి) కి పీటర్ (పార్వతీశం) లైన్ వేస్తుంటాడు. శ్రీశైలం వెళ్లి ఓ సిద్ధాంతిని కలుసుకున్న ఆద్య, రంభలు తమ జీవిత భవిష్యత్ గురించి ఓ ఆశ్చర్య కరమైన విషయం వింటారు. అయితే ఆ కారణాలతోనే అశ్విత్, ఆద్యలకు.. పీటర్, రంభలకు పెళ్లి జరుగుతుంది. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది.. అసలు సిద్ధాంతి వారికి ఏమని చెప్పాడు..? పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి..? ఆద్య, రంభలు చివరకు ఎవరికి దక్కారు అన్నది అసలు కథ.  

చేతన్ గా నటించిన అశ్విత్ కామ్ గోయింగ్ వాడిలా నటించగా.. పీటర్ గా కేరింత నూకరాజు అదేనండి పార్వతీశం మరోసారి అదరగొట్టేశాడు. సినిమా మొత్తం కామెడీ పండించిన పార్వతీశం సినిమాలో ఉన్న స్కోప్ ను యూజ్ చేసుకున్నాడు. ఇక ఆద్యగా కృతిక ఎప్పటిలానే క్యూట్ గా నటించింది. కాని ఆద్య క్యారక్టరైజేషన్ విషయంలో దర్శకుడు కాస్త పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. ఇక రంభగా తేజశ్వి మరోసారి ఈ కాలం అల్లరి అమ్మయిలా అదరగొట్టింది. పీటర్ ను మభ్యపెట్టే సన్నివేశాల్లో తేజశ్వి నటన మెచ్చుకునేలా ఉంది. ఇక అమృతం వాసు, ఆలి, రాజా రవింద్ర, జబర్దస్త్ అప్పారావు ఏదో అలా కామెడీ చేశారు.  
మారుతి కథ స్క్రీన్ ప్లే అందించినందుకు యూత్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక కథ కథనాల దృష్ట్యా అన్ని ప్రేమకథా చిత్రం పోకడలే కనిపిస్తాయి. మారుతి కథ కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించలేదు. ఇక దర్శకుడు మురళికృష్ణ అన్ని విధాలుగా ఫ్లాప్ అయ్యాడు. కేవలం పీటర్ తో వచ్చే కామెడీ సీన్స్ తప్ప ఏ కోణంలో సినిమా సరిగా నడవలేదు. జె.బి మ్యూజిక్ సినిమా మాత్రం సినిమాకు మంచి ఫీల్ తెచ్చింది. కథ కథనాల్లో అంత గ్రిప్ లేకున్నా మ్యూజిక్ పరంగా న్యాయం చేశారు. కెమెరామన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అయితే సినిమా కేవలం 130 నిమిషాలే ఉన్నా ఎడిటింగ్ ఇంకా ఎక్కడో లోపం జరిగినట్టు అనిపిస్తుంది. ఇక దిల్ రాజు, మారుతిల ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పటిలానే బాగున్నాయి.
రోజులు మారాయి అని.. కొద్దిరోజులుగా హడావిడి చేస్తూ యూత్ టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ సినిమా మారుతి కథ కథనం అనేసరికి క్రేజ్ వచ్చింది. ఇక దిల్ రాజు సమర్పణ అనగానే సినిమాలో ఏదో విషయం ఉండి ఉంటుందని అందరు అనుకున్నారు. తీరా సినిమా ప్రేమకథా చిత్రం మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది. ఏవైతే కామెడీతో నవ్వులు తెప్పిస్తాయో అలాంటి కొన్ని సీన్స్ పెట్టుకుని మారుతి ఈ కథ రాశాడు. పీటర్, రంభ అదే పార్వతీశం, తేజశ్విల మధ్య వచ్చే కామెడీ సీన్స్ తప్ప సినిమాలో విషయం ఏం లేదు.


తమని ప్రేమించిన వారిని చంపేసి తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుందాం అన్న పాయింట్ అసలు యాక్సెప్టెన్సీ ఉండదు. సిద్ధాంతి చెప్పినప్పుడు అసలు వారు ఎందుకు వారి ఒరిజినల్ లవర్స్ ను పెళ్లి చేసుకోరో ఆడియెన్స్ కు అర్ధం కాదు. ఇక హీరో హీరోయిన్ క్యారక్టరైజేషన్ లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. హీరోయిన్ కొన్ని సార్లు హీరో గురించి ఆలోచించడం తర్వాత మరోసారి తను ప్రేమించిన విక్కి గురించి ఆలోచించడం ఏమంత బాగుండదు. 


ఇక చివర్లో హీరోయిన్ చెప్పినట్టుగా తను ఎప్పుడైతే అశ్విత్ ఇచ్చిన రింగ్ అమ్మానో అక్కడ తన క్యారక్టర్ కోల్పోయానని అంటుంది. మరి అన్ని తెలిసినా తనకు తను ప్రేమిస్తున్న వ్యక్తి మోసగాడని కనిపెట్టే ఆలోచన రాలేదా అన్న డౌట్ వస్తుంది. ఏది ఏమైతేనేం కేవలం ఒక ఆఫీస్, ఓ ఫాం హౌజ్, కొన్ని లొకేషన్స్ లో తక్కువ బడ్జెట్ తో కానిచ్చేసిన ఈ 'రోజులు మారాయి' సినిమా మరీ బోర్ కొడితే చూసే సినిమా అది కూడా మారుతి మార్క్ కామెడీలకు నవ్వేవారికే కాని మంచి సినిమా కోసం వెళ్తే మాత్రం మోసపోయినట్టే. 
Chetan Maddineni, Parvatheesam, Kruthika, Tejaswi Madivada, G Srinivas Rao, Murali Krishna Mudidani,JBరోజులు మారాయి సినిమాలే మారల..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: