‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
దీంతో ఈ సాంగ్ కి అదిరిపోయే రీతిలో తమన్ మ్యూజిక్ అందించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా నటిస్తున్న అక్కినేని సుశాంత్ పోస్టర్ ఒకటి సినిమా యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ పాత్ర పేరు రాజ్. “రాజ్ నవ్వితే ఎలాంటివాళ్లయినా ఆకర్షితులవ్వాల్సిందే” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇందులో సుశాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సుశాంత్ అల్లు అర్జున్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా, నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. మరియు అదే విధంగా ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ టబు చాలా కాలం తర్వాత ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు తెలుగు సినిమా ప్రేమికులకు కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ఈ సినిమా విడుదల కానుంది.