అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !

Seetha Sailaja
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పరిపాలన పై కీలక విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక నివేదికను కూడ ‘జనసేన’ తరఫున విడుదల చేసి ప్రస్తుతం రాజకీయంగా చాల బిజీగా ఉంటున్నాడు. ఈ నివేదికలో జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ చేసిన ఘాటైన విమర్శలు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. ఈ సమయంలో పవన్ అమరావతిలోనే ఉంటూ సినిమా రాజకీయాలు కూడ కొనసాగించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు డాలి ఈమధ్య అమరావతిలోని పవన్ ఇంటిలో కలిసి సుమారు రెండు గంటల పాటు ఒక కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్ళూరి దూతగా వచ్చిన డాలి పవన్ కు ఒక వెరైటీ కథను వినిపించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పవన్ నటించబోయే సినిమాలకు సంబంధించి దర్శకత్వం వహించడానికి త్రివిక్రమ్ క్రిష్ హరీష్ శంకర్ లు రెడీ అవుతున్న పరిస్థితులలో ఇప్పుడు డాలి కూడ వచ్చి చేరడంతో వీరందరూ చెపుతున్న వేరువేరు కథలలో దేనికి పవన్ ముందుగా ఓటు వేస్తాడు అన్న ఆసక్తి పెరిగిపోతోంది. ఈమధ్య జరిగిన ఎన్నికలలో రామ్ తాళ్ళూరి ‘జనసేన’ కోసం చాల ఖర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. 

దీనితో ఆర్ధికంగా నష్టపోయిన రామ్ తాళ్ళూరికి ముందుగా అవకాశం ఇచ్చి పవన్ అతడిని ఆదుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కు భారీ మొత్తాలు అడ్వాన్స్ లు ఇచ్చి ఎదురు చూస్తున్న మైత్రీ మూవీస్ ఎ.ఎమ్. రత్నంలకు పవన్ ఏ విధంగా సద్ది చెపుతాడు అత్యంత భారీ ఆఫర్లు ఇస్తున్న దిల్ రాజ్ పరిస్థితి ఏమిటి అన్న గందరగోళం మధ్య పవన్ సినిమా రాజకీయాలు కూడ అమరావతి కేంద్రంగా కొనసాగుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది..  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: