అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు సృష్టించి జేమ్స్ బాండ్ సినిమాల సిరీస్ ప్రపంచం ఉన్నంత వరకు కొనసాగేలా ట్రెండ్ సృష్టించాయి. ఇటువంటి నేపథ్యంలో బాండ్ పాత్ర లో చాలామంది ఇప్పటివరకు హీరోలు నటించారు. అయితే అత్యధికంగా జేమ్స్ బాండ్ పాత్రలో నటించిన హీరో ప్రస్తుతం చేస్తున్న డేనియల్ క్రెగ్. సిరీస్ లో భాగంగా డేనియల్ క్రెగ్ హీరోగా 25వ జేమ్స్ బాండ్ సినిమా టైటిల్ ఇటీవల విడుదలైంది..ఇదే క్రమంలో రిలీజ్ డేట్ ని కూడా ఫైనల్ అయింది.
డేనియల్ క్రెగ్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ బాండ్ మూవీకి ‘నో టైం టు డై’ అనే స్ట్రాంగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. చనిపోయే టైమ్ లేదు అనే అర్ధమున్న ఈ లైన్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ క్యారీ జోజి తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమాను మొదట 2020 ఏప్రిల్ 3న యూకేలో రిలీజ్ చేసి అనంతరం 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల చేయనున్నట్లు చెప్పారు, మరి ఈ జేమ్స్ బండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.