'నేను లేను' అని టైటిల్ వెరైటీగా పెట్టడంతోనే ప్రేక్షకుడ్ని ఆకట్టుకున్నాడు దర్శకుడు. 'లాస్ట్ ఇన్ లవ్' అనేది ఉపశీర్షిక పెట్టడంతో ప్రేమలో ఇంతకంటే చివరిది లేదనే అర్థంతో వచ్చిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందించారు. దర్శక నిర్మాతలు ఈ రంగానికి కొత్తే అయినా ఎక్కడా అలా అనిపించలేదు. అనుభవం ఉన్న దర్శకుడు చేసినట్లు అనిపించింది. నటీనటులపరంగా కూడా కొత్త వారిని ఎంచుకున్నారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. ముందుగానే ఈ చిత్రాన్ని కొంతమంది ప్రముఖులకు ప్రీమియర్ వేశారు. ఈ చిత్రం ఎలా వుంద