మూడు వరుస ప్లాపులు... బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కావాల్సినంత అందం.... అయితేనేం మూడు సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఎన్నో ఆశలతో తన పేరుతోనే తీసిన తొలి సినిమా అట్టర్ ఫ్లాప్. సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో చేసిన రెండో సినిమా కమర్షియల్ ప్లాప్. ఇక మూడో సినిమా గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇది అక్కినేని హీరో అఖిల్ సినిమా లైఫ్ జర్నీ. ఇక అఖిల్ కొత్త సినిమా వ్యవహారం అప్పట్లో తేలేలా లేదు.
నిర్మాత బన్నీ వాస్ ప్రతిదానికి అడ్డు పుల్లలు వేస్తుండడం, ఇటు హీరోయిన్లు, ఇతర టెక్నీషీయన్ల విషయంలో గీచి గీచి బేరాలు ఆడుతుండడంతో బన్నీవాస్ తీరుపై నాగ్, అఖిల్ ఇద్దరు గుస్సాగా ఉన్నారట. దీంతో నాగ్ ప్రస్తుతం విదేశాల్లో తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటే.. ఇటు అఖిల్ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాక గీతా సంస్థ తీరుపై రగిలిపోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి.
అఖిల్ రష్మికను హీరోయిన్గా చెపితే బన్నీ వాస్ అంత రేటు పెట్టి ఆమెను తీసుకోవడం అవసరమా ?అన్నట్టు కూడా టాక్. అసలు హీరోయిన్నే కాదు... ఏ టెక్నీషియన్‌ను కూడా ఇంకా ఎంపిక చేయలేదట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో గీతా సంస్థ సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాపైనే దృష్టి పెడుతూ ప్రస్తుతం అఖిల్ సినిమాను వీళ్లు అటకెక్కించేశారట. దీంతో అఖిల్ సినిమా ఉందని... లేదని చెప్పుకోలేక బాధపడుతున్నాడట.