బయోపిక్ ల జపం చేస్తున్న నందమూరి హీరోలు..!

KSK
నందమూరి తారకరామారావు గారి జీవితచరిత్ర కి సంబంధించి ఇటీవల రెండు బయోపిక్ సినిమాలు విడుదల అవటం జరిగాయి. ఈ సినిమాలో స్వయానా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన సంగతి మనకందరికీ తెలిసినదే. నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను గమనిస్తే ఒకటి రాజకీయ రంగానికి మరొకటి సినిమా రంగానికి ముడిపడి ఉంటుంది.


ఈ రెండు రంగాలకు సంబంధించిన తన తండ్రి జీవిత చరిత్రను నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడిగా మరొకటి ఎన్టీఆర్ మహా నాయకుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే సినిమా విడుదలైన గాని ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు నందమూరి అభిమానులు. రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవడంతో బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు.


ఇదిలా ఉండగా తాజాగా గత కొన్నేళ్లుగా హిట్ లేని తారక రత్న హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోడాని విజయవాడకు చెందిన రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్రపై తీస్తున్నారు. బెజవాడ రాజకీయాలలో దేవినేని నెహ్రూ పాత్ర చాలా పెద్దది ఈ నేపథ్యంలో ఆ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎలాగైనా గెలవాలని నందమూరి తారక రత్న తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: