కొరియాలో వరుణ్ తేజ్ స్టైలిష్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు!
వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి.కొరియాలోని స్థానికులతో కలిసి వరుణ్ సరదాగా ముచ్చటిస్తూ, అక్కడి ఫుడ్ అండ్ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రేపటి నుంచి ఈ సినిమా ఫైనల్ అటాక్ (చివరి షెడ్యూల్) మొదలుకానుంది. ఈ ఖాళీ సమయంలో వరుణ్ కొరియన్లతో కలిసి దిగిన సెల్ఫీలు చూస్తుంటే, ‘కనకరాజు’ అక్కడ కూడా తన నెట్వర్క్ గట్టిగానే పెంచుకున్నాడని అర్థమవుతోంది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తన మార్క్ కామెడీని చూపించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఈసారి వరుణ్ తేజ్‌ను ఒక డిఫరెంట్ అవతారంలో చూపించబోతున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ బ్యూటీ రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయం.