రామ్ చరణ్ - ఉపాసన: ట్విన్స్ పేర్లు ఇవే..!

Divya
మెగా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన కొణిదెల ఇటీవలే ట్విన్స్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31న మగ బిడ్డ, ఆడబిడ్డకు ఉపాసన జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఈ శుభవార్త విన్న మెగా అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఉపాసన డెలివరీ అయిన జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ వద్దకి వేలాదిమంది అభిమానులు కూడా తరలివచ్చారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన తన కవల పిల్లలను ఇంటికి తీసుకొచ్చారు.



అలాగే సాంప్రదాయకంగా నామకరణ మహోత్సవం కూడా నిర్వహించినట్లు వినిపిస్తున్నాయి. పండితులు సూచనలు సలహాలతో కేవలం బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లల పేర్లు ఇవే నంటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిల్లల జాతకం జన్మనక్షతుల ప్రకారం "కుమారుడి పేరు శివరామ్ అని, కూతురు పేరు ఆన్వీరా దేవి అన్నట్టుగా పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


పేర్ల విషయానికి వస్తే.. ఆన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలని అమ్మవారు పేరు వస్తుందట, అలాగే చిరంజీవి అసలు పేరు శివ, రామ్ చరణ్ లో రామ్ అనే పేరును తీసుకొని తమ కుమారుడికి శివ రామ్ అని నామకరణం చేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లను మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు. కాని ఇప్పటివరకు అధికారికంగా మెగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ విషయం పైన అధికారికంగా ప్రకటించలేదు. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు తో పెద్ది సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ కు జోడిగా మొదటిసారి జాన్వీ కపూర్ నటిస్తోంది. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: