విజయ్-రష్మిక పెళ్లి తేదీ మారిందా..?
అందుకే ఉదయపూర్ లో ఉండే హెరిటేజ్ ప్రాపర్టీని బుక్ చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే రిసెప్షన్ కి సంబంధించి డేట్ ని కూడా ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. ఫిబ్రవరి 2 వ తేదీన వివాహం అంటూ వినిపించిన వార్తలలో అయితే నిజం లేదని తెలుస్తోంది .ఎందుకంటే రష్మిక ,విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారి కైనా ఇన్విటేషన్ ఇవ్వాలి ,కనుక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గాని రష్మిక గాని ఎవరిని అలా కలవలేదని సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఫిబ్రవరి 26వ తేదీని వీరి వివాహం ఉండబోతుందని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటిస్తున్న సమయంలో ఈ జంట మధ్య ఏదో ఉందని అభిమానులు గుర్తించారు అప్పటినుంచి ఈ జంట పైన ఏదో ఒక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జంట తమ వివాహ ప్రకటన విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ మూడవ తేదీన ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి. అప్పుడు కూడా ఈ విషయం పైన ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదు. మరి అభిమానుల సందేహాలను తీరుస్తూ ఏదైనా అధికార యొక్క ప్రకటన చేస్తారో లేదో చూడాలి మరి.