షాక్: డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు..?

Divya
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలాన్ని సృష్టించిన అంశం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం. ముంబైలో నివాసం ఉంటున్న డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి పైన శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. సుమారుగా నాలుగు రౌండ్ల పాటు ఈ కాల్పులు జరిపి పారిపోయినట్టుగా సమాచారం. ఈ ఘటన అటు ఒక్కసారిగా ముంబై ప్రాంతంలోఉలిక్కిపాటుకు గురిచేసింది. హై సెక్యూరిటీ జోన్ గా పరిగణించే జుహులో కూడా ఈ కాల్పులు ఉదాంతం చోటు చేసుకోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు.


అయితే కాల్పులు జరిగిన సమయంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారా ?లేదా అనే విషయం పైన ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఘటన నేపథ్యంలో రోహిత్ శెట్టి ఇంటి పరిసరాలలో కూడా భారీగానే పోలీసులు మోహరించినట్లు సమాచారం. ఈ ఘటన పైన జూహు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కాల్పులు జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కాల్పులలోఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలియజేస్తున్నారు .


డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి పైన జరిగిన ఈ కాల్పులపై అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ ముంబై పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తించడానికి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుల కదలికలను కూడా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. డైరెక్టర్ రోహిత్ శెట్టి హిందీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్గా పేరు సంపాదించారు. గోల్ మాల్ కామెడీ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ చెన్నై ఎక్స్ప్రెస్, సూర్యవంశి, సింగమ్, దిల్ వాలే ఆంటీ బ్లాక్ బాస్టర్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం గోల్ మాల్ 5 తలకి ఎక్కిస్తూ ఉండగా వచ్చేయేడాది విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: