అవ్యక్తి డేంజర్..మొదటిసారి లవ్ బ్రేకప్ పై మాట్లాడిన తమన్నా..?

Divya
టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించిన హీరోయిన్ తమన్నా ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి విజయాలను అందుకుంది. అదే క్రేజ్ తో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ కూడా బాగానే అవకాశాలను అందుకుంది. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తమన్నా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం పైన నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తమన్నా ప్రేమాయణం కొనసాగడం ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం వంటి విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.


తాజా ఇంటర్వ్యూలో తమన్నా లవ్ ,బ్రేకప్ విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో రిలేషన్షిప్, బ్రేకప్ వంటి విషయాలు కామన్. తమన్నా జీవితంలో రెండుసార్లు బ్రేకప్ అయ్యిందని ఎమోషనల్ గా మాట్లాడింది. తాను టీనేజ్ లో ఉన్న సమయంలోనే మొదటిసారి ప్రేమలో పడ్డాను, కానీ అప్పుడు నా లక్ష్యం కోసం, కెరియర్ కోసం ఆ బంధాన్ని వదిలేశానని తెలిపింది. ఆ తర్వాత మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను, కానీ కొన్ని నెలలకే ఆ వ్యక్తి నాకు సరైన జోడి కాదనిపించింది. ముఖ్యంగా అలాంటి వ్యక్తితో బంధం కొనసాగించడం చాలా ప్రమాదకరమని గ్రహించానని పేర్కొంది.


దీంతో తమన్నా మాట్లాడిన డేంజర్ పర్సన్ ఎవరా? అని పలువురు నెటిజెన్స్ ఆరా తీయగా కొంతమంది విజయవర్మనేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్2 సిరీస్ లో తమన్నా , విజయ్ వర్మ ఇంటిమెట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చేయడంతో ఈ జంట గురించి బాలీవుడ్లో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. అప్పటినుంచి ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా ఇద్దరూ కలిసి తిరగడం ఫోటోలు షేర్ చేయడంతో త్వరలోనే వివాహం చేసుకుంటారని అందరు అనుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయినట్టుగా వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఎందుకు విడిపోయారనే విషయం పైన ఏ ఒక్కరూ క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: