హిందీ సినిమాలకు మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ సినిమాలకు కాస్త మంచి టాక్ వచ్చినా కూడా ఆ సినిమాలకు పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా బర్డర్ 2 అని హిందీ సినిమా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాపై విడుదలకు ముందు నుండి కూడా హిందీ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల అయింది.
అలాగే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మొదటి రోజు 32.10 కోట్లు , రెండవ రోజు 40.59 కోట్లు , మూడవ రోజు 57.20 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు మొత్తంగా మూడు రోజుల్లో కలిపి ఈ మూవీ కి 129.89 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ మొదటి మూడు రోజులు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేయడంతో ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన కలెక్షన్లను టోటల్ బాక్స ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రాబడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.