"ఎల్లమ్మ" ప్రాజెక్ట్ పోతే ఏం..దానికి మించిపోయే సినిమా పట్టేసిన నితిన్..!
‘ఊరు పేరు భైరవకోన’ సినిమా తర్వాత వి.ఐ. ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ హై కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్— కలిపి ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా, ఇటీవల ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆ ప్రాజెక్ట్ వదులుకున్నందుకు కొంతమంది నెటిజన్లు నితిన్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ భారీ సై-ఫై సినిమా అనౌన్స్ కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “ఎల్లమ్మ ప్రాజెక్ట్ పోతే ఏముంది… దానికంటే పెద్ద ఆఫర్ దక్కింది” అంటూ నితిన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మొత్తానికి, కథ ఎంపిక విషయంలో ఎప్పుడూ కొత్తదనం కోరుకునే నితిన్ మరోసారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని, ఈ సినిమా ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.