మెగా ఫ్యాన్స్ బాధ అర్ధం చేసుకున్న బాబీ..చిరంజీవి సినిమాకి అలాంటి టైటిల్..?!
మెగాస్టార్ సినిమాలకు టైటిల్ చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్, క్యాచీ టైటిల్స్ ఉండాలని మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటుంటారు. ఆ కోణంలో చూస్తే, ఈ సినిమాకు దర్శకుడు బాబీ ఓ స్ట్రాంగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘కాక’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫైనల్ చేయాలని యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ మాస్ క్యారెక్టర్‌కు ఈ టైటిల్ పక్కాగా సెట్ అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రముఖ నటి ప్రియమణి కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే చిరంజీవి కుమార్తె పాత్రలో కృతి శెట్టి నటిస్తుందనే వార్తలను చిత్ర బృందం స్పష్టంగా ఖండించింది. ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి క్యాస్టింగ్ వివరాలతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా మెగా 158 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, చిరంజీవి–బాబీ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.