అప్పుడు యాత్ర..ఇప్పుడు పాదయాత్ర..మమ్ముట్టి కొత్త మూవీ..!

Divya
మలయాళం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు హీరో మమ్ముట్టి. ఇప్పటికీ విభిన్నమైన సినిమాలతో అభిమానులను అలరిస్తూ ఉన్న మమ్ముట్టి తన తదుపరి చిత్రం పాదయాత్ర అనే టైటిల్ తో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని మలయాళం డైరెక్టర్ అధర్ గోపాలకృష్ణ దర్శకత్వంలోనే రాబోతోంది. దీంతో మమ్ముట్టి చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులలో కూడా మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. అందుకు కారణం గతంలో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన యాత్ర సినిమాలో నటించారు.


యాత్ర సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మమ్ముట్టి, ఆ తర్వాత యాత్ర 2 సినిమాలో కూడా నటించారు. యాత్ర సినిమా మంచి విజయాన్ని అందుకోగా యాత్ర 2 మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు తాజాగా పాదయాత్ర అనే పేరుతో ఒక సినిమా ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా మాజీ సీఎం వైసీపీ అధినేత  జగన్ ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్ర 2027లో చేయబోతున్నానని చెప్పడంతో ఆ తర్వాత ఈ సినిమా పోస్టర్ రావడంతో ఈ సినిమా పైన క్యూరియాసిటీ పెరిగిపోయింది.


అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను  చెప్పడం,మమ్ముట్టి పాదయాత్ర పేరుతో సినిమా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ సినిమా తెలుగు సినిమా లేకపోతే మలయాళ సినిమా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు తెరకెక్కించడంతో మలయాళ సినిమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఏపీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండదనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ పాదయాత్ర సినిమా ఎవరిది? అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: