కొంతమంది హీరోలు మొదట స్టోరీ నచ్చి సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత ఆ సినిమాలో తమ యాక్టింగ్, లుక్ నచ్చక వీటన్నింటినీ చూసుకొని అసహనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అచ్చం ఇలాగే నటుడు శర్వానంద్ కూడా తన సినిమాను చూసి అందులో ఉంది నేనేనా.. నాకే సిగ్గుగా అనిపిస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరి ఇంతకీ శర్వానంద్ కి తన సినిమాల్లో నచ్చని లుక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా శర్వానంద్ సంక్రాంతికి నారి నారి నడుమ మురారి అనే మూవీతో వచ్చి హిట్టు కొట్టారు. చాలా రోజుల తర్వాత శర్వానంద్ ఖాతాలో ఓ హిట్టు పడడంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు.అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ తన సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
శర్వానంద్ తాజాగా మాట్లాడుతూ.. నేను జానూ సినిమాలో చేసే సమయంలో నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది.. ఆ టైంలో డాక్టర్లు నా చేయి కూడా పని చేయదని చెప్పారు. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను కోలుకున్నాను.కానీ ఆ టైం లో చాలా లావైపోయాను. ఆ సమయంలో నాకు కొన్ని సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. అలా ఆడవాళ్లు మీకు జోహార్లు,శ్రీకారం వంటి సినిమాలు చేశాను.అయితే ఆ సినిమాలు చేసిన తర్వాత చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. సిగ్గుగా అనిపించింది. అసలు నేనేంటి ఇంత లావుగా ఉన్నాను.. నేనున్న ఈ కటౌట్ కి టికెట్లు తెగాలా.. అస్సలు కలెక్షన్స్ రావు..ముందుగా నా బాడీని మార్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాను.
అలా మొదట వాకింగ్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత యోగ, రన్నింగ్, డైటింగ్ చేస్తూ మళ్ళీ నా శరీరాన్ని మునుపటిలా మార్చుకున్నాను. నారి నారి నడుమ మురారి సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాను. అలాగే బైకర్ మూవీలో కూడా ఈ విధంగానే కనిపిస్తాను. ఇప్పటినుండి అన్నీ మంచి సినిమాలే చూజ్ చేసుకుంటాను అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చారు. ఇక శర్వానంద్ చెప్పినట్టు గతంలో ఆయన నటించిన రెండు మూడు సినిమాల్లో కాస్త బొద్దుగానే కనిపించారు. కానీ తాజాగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా సమయానికి మాత్రం తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేసుకున్నారు.